Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

Bangarraju: సంక్రాంతికి రావాల్సిన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డ‌డంతో అనుకోకుండా తెర‌మీదికి వ‌చ్చాడు బంగార్రాజు. రెండు పెద్ద సినిమాలు రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో...

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2022 | 7:38 AM

Bangarraju: సంక్రాంతికి రావాల్సిన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డ‌డంతో అనుకోకుండా తెర‌మీదికి వ‌చ్చాడు బంగార్రాజు. రెండు పెద్ద సినిమాలు రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో సైలెంట్‌గా రంగంలోకి దిగాడు. దీంతో స‌డ‌న్‌గా రిలీజ్ డేట్ ఫిట్స్ చేయ‌డంతో సినిమా యూనిట్ ఒక్క‌సారిగా ప్ర‌మోష‌న్స్ వేగాన్ని పెంచేసింది. జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఆదివారం చిత్ర యూనిట్ మ్యూజిక‌ల్ నైట్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది. అత్యంత త‌క్కువ మంది స‌మ‌క్షంలో ఈ వేడుకను నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా నాగార్జున ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. జ‌న‌వ‌రి 14 అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజ‌ని తెలిపిన నాగ్‌.. అన్నపూర్ణ స్టూడియోస్ జ‌న‌వ‌రి 14నే పుట్టింద‌ని చెప్పుకొచ్చారు. నాగ్ మాట్లాడుతూ.. 50 సంవత్సరాల క్రితం నాన్న గారు దసరా బుల్లోడు అనే చిత్రంతో దుమ్ము లేపారు. అది కూడా జనవరి 14న విడుద‌లైంది. అది సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్ అని చెప్పుకొచ్చారు.

ఇక బంగార్రాజు మ్యూజిక్ గురించి మాట్లాడుతూ.. అనూప్ చ‌క్క‌టి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ మ్యూజిక్ ఇచ్చాడ‌న్నారు. అంతేకాకుండా బంగార్రాజు సినిమా అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంద‌ని తెలిపారు. జ‌న‌వ‌రి 11న సినిమా ట్రైల‌ర్‌ను, 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నాగార్జున తెలిపారు. ఇదిలా ఉంటే బంగార్రాజు సినిమాను.. సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు అనూప్ మ్యూజిక్‌ను అందించారు.

Also Read: Covirgin: ఇప్పటిదాకా కరోనా సోకనివారిని ఏమని పిలుస్తారో తెలుసా? డిక్షనరీలో పుట్టుకొచ్చిన కొత్త పదం!

Goa Election 2022: స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన

Corona: వారికి వర్క్​ ఫ్రం హోం.. కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త మార్గదర్శకాలు