Covirgin: ఇప్పటిదాకా కరోనా సోకనివారిని ఏమని పిలుస్తారో తెలుసా? డిక్షనరీలో పుట్టుకొచ్చిన కొత్త పదం!
గడిచిన రెండేళ్లలో కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కుటుంబాలు తమవారిని కోల్పోయారు. అయితే, ఇప్పటిదాకా కరోనా కాటు ఎరుగనివాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అదిగో, అలాంటివారి కోసమే డిక్షనరీలో కొత్త పదం పుట్టుకొచ్చింది.
Covirgin: ప్రపంచవ్యాప్తం కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల అన్ని దేశాలపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు విడతల్లో వైరస్ ధాటికి కోట్లాది మంది విలవిలలాడారు. తాజాగా భారతదేశంపై కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కేసుల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయింది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి..
గడిచిన రెండేళ్లలో కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కుటుంబాలు తమవారిని కోల్పోయారు. అయితే, ఇప్పటిదాకా కరోనా కాటు ఎరుగనివాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అదిగో, అలాంటివారి కోసమే డిక్షనరీలో కొత్త పదం పుట్టుకొచ్చింది.
Ohh nice title ? , I’m #covirgin & you..??? pic.twitter.com/F83sOJmLzb
— Wikki ? (@WROGN_18) January 9, 2022
కాలం మారుతున్నా కరోనా పీడ మాత్రం వదలడంలేదు. మళ్లీ మళ్లీ తిరగబెడుతూ.. కరోనా మహమ్మారి. కొత్త వేరియంట్ తోపాటు పాత వేరియంట్లూ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి. మన దేశంలో నిన్న ఒక్కరోజే కొవిడ్ కాటుకు 327 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 1.6లక్షల కేసులు నమోదయ్యాయి. మరోవైపు విశ్వవ్యాప్తంగా నేటికి కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 30కోట్ల మార్కును చేరగా, మరణాల సంఖ్య 55 లక్షలు దాటేసింది. కొవిడ్ బాధితులు అత్యధిక నమోదైన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న భారతదేశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి దాకా 4.83లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, కేసుల సంఖ్య 3.5కోట్లకుపైగా ఉంది.
అయితే, ఇప్పటిదాకా కొవిడ్ బారిన పడనివారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అదిగో, అలాంటివారి కోసమే డిక్షనరీలో కొత్త పదం పుట్టుకొచ్చింది. వయసును బట్టి లైంగిక ఉద్దీపన కలిగిన తర్వాత కూడా కామక్రియలో పాల్గొనని వాళ్లను వర్జిన్ అంటారని తెలిసిందే. మన హిందీ, తెలుగులో భాషల్లోనైతే వర్జిన్ పురుషుణ్ని బ్రహ్మచారి అని, స్త్రీని కన్య అని పిలుస్తుంటారు. అదే తీరులో, ప్రపంచమంతా కరోనా కల్లోలం కొనసాగుతున్నా ఇప్పటిదాకా వైరస్ కాటుకు గురికాని వ్యక్తుల్ని ‘కొవర్జిన్ (covirgin)’అని భావించాలట.
ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ హిందీ, ఇంగ్లీష్ డిక్షనరీల్లో ఇప్పటికే ఈ పదం వ్యాప్తిలోకి వచ్చింది. ఇంగ్లీష్, హిందీ వొకాబులరీకి కొత్త పదం జోడైందంటూ కొవర్జిన్ నెట్టింట వైరల్ అవుతోంది. #covirgin ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లోనూ నిలిచింది. నిజానికి కొవిడ్ సోకని వ్యక్తుల్ని కొవర్జిన్ గా అభివర్ణించడం గతేడాది నుంచే మొదలైంది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడీ పదం మరోసారి వైరలవుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు ప్రఖ్యాత సంస్థల నిపుణుల అంచనాల ప్రకారం పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చిన కొవిడ్ వేరియంట్లలో కొందరు మనుషులకు సోకినా బహుశా ఆ విషయం తెలియకుండా, పెద్ద ప్రభావమేమీ లేకుండా ఉంటాయి. మన దేశంలో కొవిడ్ పై జరిపిన పలు సర్వేల్లోనూ జనాభాలో 60 నుంచి 70 శాతం మందికి కొవిడ్ వచ్చి పోయిందని, ప్రమాదకర వేరియంట్ల విషయంలోనే జాగ్రత్తలు అవసరమని రిపోర్టులున్నాయి. ప్రస్తుతం జడలు విప్పుతోన్న ఒమిక్రాన్ ను ప్రమాదకర వేరియంట్ గా డబ్ల్యూహెచ్ఓ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలు భారీ ఎత్తున కొవిడ్ ఆంక్షలను మరోసారి కఠినతరం చేస్తున్నాయి.
Read Also…. Telangana Corona: దేశంలో థర్డ్‌వేవ్ ఉగ్రరూపం.. తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే?