AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona: దేశంలో థర్డ్‌వేవ్‌ ఉగ్రరూపం.. తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే?

దేశంపై కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. కేసుల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయింది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి..

Telangana Corona: దేశంలో థర్డ్‌వేవ్‌ ఉగ్రరూపం.. తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Balaraju Goud
|

Updated on: Jan 09, 2022 | 9:08 PM

Share

Telangana Covid 19 Cases: దేశంపై కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. కేసుల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయింది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.. కొత్త కేసుల కారణంగా క్రియాశీల కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదవుతోంది. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరగ్గా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.77 శాతానికి చేరింది.

ఇటు, తెలంగాణలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,583 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,673 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,94,030కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి ధాటికి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 4,042కి చేరుకుంది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజు 330 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 13,522 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య తెలిపింది.

కాగా.. దేశంలో థర్డ్‌వేవ్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. ఒక్కరోజులో లక్షా 60 వేల కేసులు నమోదు కావడం, ఒమక్రాన్‌ కేసులు మూడున్నరవేలు దాటి పోవడం ఆందోళనకు గురి చేస్తోంది.. వైరస్‌ కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు ప్రధాని.. దివ్యాంగులు, మహిళలతో పాటు కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా వర్క్‌ ఫ్రమ్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు..

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయింది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. శ‌నివారం ఒక్క‌రోజే దేశంలో ల‌క్ష‌న్న‌ర మందికి పైగా వైర‌స్ బారిన‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,59,377 మందికి Coronavirus సోకింది. రోజువారీ కేసులు లక్ష దాటిన రెండు రోజుల్లోనే 1.5 లక్షలకు చేరుకోవడంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. Covid-19 సేకండ్ వేవ్ స‌మ‌యంలో 2021 మే 30న చివరిసారిగా లక్షన్నర కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలోనే శనివారం రోజువారీ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,55,28,004 పెరిగింది.

Read Also…  CM KCR: రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు భారీగా ఏర్పాట్లు.. చినజీయర్‌స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్ యాగశాల పరిశీలన

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి