CM KCR: రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు భారీగా ఏర్పాట్లు.. చినజీయర్‌స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్ యాగశాల పరిశీలన

యాదాద్రి ఆలయ పున:ప్రారంభంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో చర్చించారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శనయాగం ఏర్పాట్లు, ఆహ్వానాలతోపాటు, ఫిబ్రవరిలో జరిగే సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం పనులనూ పరిశీలించారు

CM KCR: రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు భారీగా ఏర్పాట్లు.. చినజీయర్‌స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్ యాగశాల పరిశీలన
Cm Kcr
Follow us

|

Updated on: Jan 09, 2022 | 8:35 PM

CM KCR Visits Chinna Jeeyar Swamy Ashram: యాదాద్రి ఆలయ పున:ప్రారంభంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో చర్చించారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శనయాగం ఏర్పాట్లు, ఆహ్వానాలతోపాటు, ఫిబ్రవరిలో జరిగే సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం పనులనూ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నిశాఖలు సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు రుత్వికులు.

యాదాద్రిలో మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. ఆ ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్‌స్వామితో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. చినజీయర్ స్వామి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం మార్చి 28న గర్భాలయంలోని స్వయంభువుల నిజదర్శనాలను భక్తులకు కల్పించనున్నారు.

ఫిబ్రవరిలో జీయర్‌ ఆశ్రమంలో జరిగే సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి యాగశాలలను సందర్శించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ ఏర్పాట్లను స్వయంగా కేసీఆర్‌కు వివరించారు చినజీయర్ స్వామి. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, మైం హోం గ్రూప్స్ అధినేత రామేశ్వరరావు ఉన్నారు.

విద్యుత్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. యాగం సమయంలో నిరంతరాయంగా పవర్ సప్లై చేయాలని ఆదేశించారు. మిషన్‌ భగరీథ నీరు అందించాలని సూచించారు. యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. యాగశాల వద్ద ఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు, యాగానికి వచ్చే వీఐపీల కోసం వసతి, రోడ్డు సౌకర్యం వంటి అంశాలపై సూచనలు చేశారు. సమతామూర్తి విగ్రహాన్ని కూడా పరిశీలించారు సీఎం కేసీఆర్..

ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో వైభవంగా జరగబోతున్నాయి. 200 ఎకరాల్లో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 12 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. రోజుకు కోటిసార్లు నారాయణ మంత్ర పఠనం ఉంటుంది.. మొత్తం 128 యాగశాలల్లో హోమం నిర్వహిస్తారు. 1200 కోట్ల రూపాయలతో సమతామూర్తి విగ్రహాన్ని రూపొందించారు.. రెండో అంతస్తులో ఐదు అడుగుల బంగారు విగ్రహం ఉంటుంది. ఇందుకోసం 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. సహస్రాబ్ది వేడుకల కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ NV రమణ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇప్పటికే ఆహ్వానించారు.

Read Also…  CM KCR Review: కరోనా పట్ల భయాందోళనలు అక్కరలేదు.. స్వీయ నియంత్రణతో పండుగలు జరుపుకోండిః కేసీఆర్