AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ల ర‌చ్చకు నేటితో ఫుల్‌స్టాప్ ప‌డ‌నుందా.. మ‌రికొద్ది సేప‌ట్లో నాని, ఆర్జీవీ భేటీ..

Ram Gopal Varma: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల వ్యవ‌హారం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌భుత్వం వ‌ర్సెస్ సినిమా ఇండ‌స్ట్రీ అన్న‌ట్లు సాగిన చ‌ర్చ‌లోకి..

Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ల ర‌చ్చకు నేటితో ఫుల్‌స్టాప్ ప‌డ‌నుందా.. మ‌రికొద్ది సేప‌ట్లో నాని, ఆర్జీవీ భేటీ..
Narender Vaitla
|

Updated on: Jan 10, 2022 | 6:00 AM

Share

Ram Gopal Varma: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల వ్యవ‌హారం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌భుత్వం వ‌ర్సెస్ సినిమా ఇండ‌స్ట్రీ అన్న‌ట్లు సాగిన చ‌ర్చ‌లోకి లేటుగా అయినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. నిర్మాత‌కు, ప్రేక్ష‌కుల‌కు లేనిది ప్ర‌భుత్వానికి ఏంట‌ని, సినిమా టికెట్ ధ‌ర‌ను నిర్ణ‌యించే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఎక్క‌డిద‌ని త‌న‌దైన లాజిక్‌తో రంగంలోకి దిగారు ఆర్జీవీ. ఈ నేప‌థ్యంలోనే ప‌లు వ‌రుస ట్వీట్స్ చేస్తూ ఇండ‌స్ట్రీ దృష్టిని తన‌వైపు తిప్పుకున్నారు. అయితే ఈ చ‌ర్చ‌కు మ‌రో కొత్త రూపాన్ని తీసుకొచ్చింది టీవీ9 బిగ్‌న్యూస్ బిగ్ డిబెట్ కార్య‌క్ర‌మం.

ఏపీ సినిమా టికెట్ వ్య‌వ‌హారంపై జ‌రిగిన బిగ్ డిబెట్‌లో అటు వ‌ర్మతో పాటు మంత్రి పేర్ని నాని హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన చ‌ర్చ నేరుగా క‌లిసి మాట్లాడుకుందాం అనే వ‌ర‌కు చేరుకుంది. త‌న‌ను ఎప్పుడైనా క‌ల‌వొచ్చ‌ని నాని తెల‌ప‌డంతో దానికి వ‌ర్మ కూడా ఒకే అన్నారు. దీంతో వీరిద్ద‌రి చ‌ర్చ‌కు కార్య‌రూపం దాల్చింది. ఈరోజు మ‌ధ్యాహ్నం (సోమ‌వారం) ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ జరగనుంది. తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని.. ఈనెల 10వ తేదీన మంత్రి పేర్ని నానితో భేటీ కాబోతున్నట్లు ఆర్జీవీ ట్విట్ చేశారు.

ఇక ఈ భేటీలో ఏం తేల‌నుంద‌న్న దానిపై అంద‌రిలోనూ ఉత్కంఠత నెల‌కొంది. ఈ భేటితో గ‌తకొన్ని రోజులుగా జ‌రుగుతోన్న చ‌ర్చ‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుందా.? వ‌ర్మ ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధించ‌నున్నారు.. దానికి నాని ఎలాంటి స‌మాధానాలు ఇస్తారో తెలియాలంటే మ‌రికొద్ది సేపు వేచి చూడాల్సిందే.

Also Read:సురభి సోయగాలు ఫిదా కానీ కుర్రాడు కుర్రాడే కాదు..

RRR: ఇంకా క్రేజ్ తగ్గని ‘నాటు నాటు’.. బ్లాక్ అండ్‌ వైట్‌ సినిమాకు ఎలా రీమిక్స్‌ చేశారో చూడండి..

Bangarraju Musical Night : బంగార్రాజు పాటల సందడి.. గ్రాండ్ గా మ్యూజికల్ నైట్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!