Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..

Pushpa: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప సినిమా ఎంత‌టి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ అంశాన్ని ఇతి వృత్తంగా...

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2022 | 7:39 AM

Pushpa: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప సినిమా ఎంత‌టి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ అంశాన్ని ఇతి వృత్తంగా చేసుకొని సుకుమార్ మ‌లిచిన ఈ సినిమా అద్భ‌త విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఒక కూలీ ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ సిండికేట్‌కు లీడ‌ర్‌గా ఎలా ఎదిగాడ‌న్న క‌థాంశంతో వ‌చ్చిన పుష్ప ది రైజ్.. ఒక్క తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాకుండా యావత్ ఇండియ‌న్ ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బ‌న్నీ యాక్టింగ్‌కు సినీ ల‌వ‌ర్స్ ఫిదా అవుతున్నారు. పూర్తిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో మాస్ లుక్‌లో క‌నిపించి త‌న న‌ట విశ్వ‌రూపాన్ని చూపించాడు. సినిమాను మొత్తం త‌న భుజాల‌పై మోసి విజ‌య తీరాల‌కు చేర్చారు.

ఇక బ‌న్నీకి కేవ‌లం టాలీవుడ్ నుంచే కాకుండా ఇత‌ర ఇండ‌స్ట్రీల నుంచి ప్ర‌శ‌సంల వ‌ర్షం కురుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్స్ బ‌న్నీపై ప్ర‌శంస‌లు కురింపించ‌గా తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ అర్జున్ క‌పూర్ కూడా వ‌చ్చి చేశారు. తాజాగా ఇన్‌స్టా వేదిక‌గా పుష్ప చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అర్జున్ పోస్ట్ చేస్తూ.. `ఆర్య బ్లాక్ బస్టర్ సినిమా నుంచి బన్నీకి నేను వీరాభిమానిని. పుష్ప సినిమా కాదు. ఇది ఒక అనుభవం. పుష్ప ఒక పువ్వు కాదు అది నిప్పు… పెద్ద స్క్రీన్ పై అతని కళ్లు కణకణ మండుతున్నాయి` అంటూ రాసుకొచ్చారు.

Pushpa

అర్జున్ పోస్ట్‌పై బ‌న్నీ స్పందించారు. రీపోస్ట్ చేస్తూ.. ` చాలా ధన్యవాదాలు. మీరు అగ్నిని అనుభవించినందుకు ఉప్పొంగాను .. అందరి ప్రేమకు ధన్యవాదాలు` అంటూ రిప్లయ్ ఇచ్చారు అల్లు అర్జున్‌. ఏది ఏమైనా పుష్ప చిత్రంతో బ‌న్నీస్థాయి పాన్ ఇండియా నేప‌థ్యంలో ఓ రేంజ్‌లో దూసుకుపోయింద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: Beauty tips: కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోండిలా..

Covid Vaccine: తెలంగాణలో రేపటి నుంచి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్‌ వ్యాక్సిన్‌.. ఎవరెవరు అర్హులంటే..

Akhilesh Yadav: అయోధ్య రామ మందిరంపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?