AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: మళ్లీ అలాంటి పాత్రలో మెప్పించనున్న సామ్.. ఈసారి మరింత పవర్ ఫుల్ క్యారెక్టర్ లో..

విడాకుల తర్వాత సమంత స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే.  టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు కూడా ఓకే చెప్పింది. 

Samantha: మళ్లీ అలాంటి పాత్రలో మెప్పించనున్న సామ్.. ఈసారి మరింత పవర్ ఫుల్ క్యారెక్టర్ లో..
Samantha
Basha Shek
|

Updated on: Jan 10, 2022 | 9:15 AM

Share

విడాకుల తర్వాత సమంత స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే.  టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు కూడా ఓకే చెప్పింది.  కాగా గతేడాది ఆమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు ఎక్కువగా హీరోయిన్ పాత్రలే చేస్తూ వస్తోన్న సామ్ ఈ సిరీస్ లో ‘రాజీ’ గా మొదటిసారి నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్లో అభినయించి మెప్పించింది.  ఈ పాత్రతో జాతీయ స్థాయిలో ఆమె పేరు మార్మోగిపోయింది.  తాజాగా తాను మరో ఛాలెంజింగ్‌ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.  ‘రాజీ’ లానే  మరో సారి నెగెటివ్‌ పాత్రలో అలరించనుందట.

తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి సామ్ నటిస్తున్న చిత్రం ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’.  విఘ్నేష్‌ శివన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో  ఆమె  ‘ఖతిజా’ అనే పాత్రలో నటిస్తోంది. అయితే  ఈ క్యారెక్టర్  నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ సేతుపతి, నయన తార ప్రేమాయణానికి అడ్డుపడే విలన్ పాత్రలో ఆమె కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. డైరెక్టర్ సామ్ క్యారెక్టర్ ను  పవర్ ఫుల్ గా తీర్చిదిద్దా రని, సినిమాలో  ఆమె విలనిజం  కథను మలుపు తిప్పనుందని సమాచారం.   కాగా హాలీవుడ్ సినిమా ‘ అరెంజ్ మెంట్స్ ఆఫ్‌ లవ్‌’ సినిమాలోనూ తాను బై-సెక్సువల్‌ యువతి పాత్ర పోషిస్తున్న విషయాన్ని  ఇదివరకే  ప్రకటించింది సామ్.  ఇటీవల పుష్ప సినిమాలో ఆమె నటించిన పాట సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆమె తెలుగులో ‘శాకుంతలం’ తో పాటు ‘యశోదా’ సినిమాల్లో నటిస్తోంది. హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లోనూ నటించేందుకు ఓకే చెప్పింది.

Also Read:

Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Silver Price Today: దేశంలో స్థిరంగా వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..

Medico Suicide: హైదరాబాద్ శివారులో విషాదం.. వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. తండ్రి ఇచ్చిన క్లూతో పోలీసుల దర్యాప్తు!

బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..