Medico Suicide: హైదరాబాద్ శివారులో విషాదం.. వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. తండ్రి ఇచ్చిన క్లూతో పోలీసుల దర్యాప్తు!

మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరో వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.

Medico Suicide: హైదరాబాద్ శివారులో విషాదం.. వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. తండ్రి ఇచ్చిన క్లూతో పోలీసుల దర్యాప్తు!
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 10, 2022 | 7:53 AM

Hyderabad Medical student: మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరో వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. శివారు ప్రాంతం రాజేంద్రనగర్‌లో ఓ వైద్య విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడు రాష్ట్రానికి చెందిన సెల్వన్‌ కుటుంబం వ్యాపార నిమిత్తం 2005వ సంవత్సరంలో నగరానికి వలస వచ్చారు. హైదర్‌గూడ న్యూఫ్రెండ్స్‌ కాలనీలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. సెల్వన్‌ దంపతులకు వినీషా(21) ఒక్కతే కూతురు. ఆమె మొయినాబాద్‌లోని భాస్కర కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం తన రూమ్‌లోకి వెళ్లిన వినీషా సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించింది. స్థానికులు అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

తండ్రి సెల్వన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజులుగా తమ కుమార్తె డిప్రెషన్‌లో ఉందని, కాలేజీలోని స్నేహితులతో తరచు మాట్లాడుతూ ఏదో విషయమై బాధపడుతోందని సెల్వన్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినీషా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read Also….  AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో టీచింగ్ పోస్టులు.. ఇంట‌ర్వూ ఆధారంగా ఎంపిక‌..