Vijayawada: ప్రేమను ఒప్పుకోవాలని అందరి ముందు యువకుడు ఒత్తిడి.. చెంపపై కొట్టిన బాలిక.. దీంతో

 ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా ప్రేమోన్మాదుల  దాడులు ఆగడం లేదు. రోజూ ఏదో ఒక చోట దాడులకు తెగబడుతూనే ఉన్నారు. 

Vijayawada: ప్రేమను ఒప్పుకోవాలని అందరి ముందు యువకుడు ఒత్తిడి.. చెంపపై కొట్టిన బాలిక.. దీంతో
Attack on girl
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 10, 2022 | 8:13 AM

 ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా ప్రేమోన్మాదుల  దాడులు ఆగడం లేదు. రోజూ ఏదో ఒక చోట దాడులకు తెగబడుతూనే ఉన్నారు.  విజయవాడలో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆదివారం మధ్యాహ్నం ప్రేమ పేరిట ఓ బాలికపై దాడి చేశాడు దుండగుడు. దాడిలో గాయపడిన విజయవాడ భారతి నగర్‌కు చెందిన బాలిక… ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే..  భారతి నగర్‌లో నివసించే బాలిక… ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు తల్లి లేదు. తండ్రి అనారోగ్యం బారిన పడటంతో.. నాయనమ్మే బాలికను సాకుతోంది. విజయవాడలో ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన హరీష్‌… బాధిత బాలికతో కలిసి మూడేళ్ల పాటు ఒకే స్కూల్లో కలిసి చదివాడు. అప్పటి నుంచి ఇద్దరికీ స్నేహం ఉంది. అయితే ఇటీవలి కాలంలో హరీష్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ బాధిత బాలికను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న బాలికపై…. తన ప్రేమను అంగీకరించాలంటూ అందరి ముందు ఒత్తిడి చేశాడు. దీంతో కోపంతో బాలిక… హరీష్‌ను చెంపపై కొట్టింది. ప్రేమకు నో చెప్పడమే కాకుండా అందరి ముందు కొట్టిందనే ఆగ్రహంతో ఉన్న నిందితుడు… ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధితురాలి ఇంటికి వెళ్లాడు. చాలాసేపు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన హరీష్‌… అక్కడే ఉన్న కత్తితో ఆమె ముఖం, మెడపై దాడి చేశాడు. కత్తి దాడిలో గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు హరీష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: చెట్టెక్కి కోస్తుండగా బావిలో పడిన కొబ్బరికాయలు.. వాటి కోసం నూతిలోకి దిగగా షాక్..

సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత