AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో టీచింగ్ పోస్టులు.. ఇంట‌ర్వూ ఆధారంగా ఎంపిక‌..

AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. గోర‌ఖ్‌పూర్‌లోని ఈ వైద్య విద్య సంస్థ‌లో ఫ్యాకల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో టీచింగ్ పోస్టులు.. ఇంట‌ర్వూ ఆధారంగా ఎంపిక‌..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2022 | 7:45 AM

AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. గోర‌ఖ్‌పూర్‌లోని ఈ వైద్య విద్య సంస్థ‌లో ఫ్యాకల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న‌లో భాగంగా మొత్తం 105 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో ప్రొఫెసర్లు (28), అడిషనల్‌ ప్రొఫెసర్ (22), అసోసియేట్‌ ప్రొఫెసర్ (23), అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (32) ఖాళీలు ఉన్నాయి.

* అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, న్యూరోసర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, యూరాలజీ స్పెష‌లైజేష‌న్స్‌లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం త‌ప్ప‌నిస‌రి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు పోస్టుల ఆధారంగా 58 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌ను ఎయిమ్స్, గోరఖ్‌పూర్, యూపీ అడ్ర‌స్‌కు పంపించాలి.

* అభ్య‌ర్థుల‌ను మొద‌ట ప‌ని అనుభ‌వం ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 31-01-2022తో ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Clock Vastu: గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..

Telangana Corona: దేశంలో థర్డ్‌వేవ్‌ ఉగ్రరూపం.. తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Goa Election 2022: స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన