ESIC Recruitment: ఈఎస్ఐసీలో భారీగా ఉద్యోగ నియామ‌కాలు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు..

ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే ఈ సంస్థ‌లో...

ESIC Recruitment: ఈఎస్ఐసీలో భారీగా ఉద్యోగ నియామ‌కాలు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు..
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2022 | 7:45 AM

ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే ఈ సంస్థ‌లో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 3820 పోస్ట‌ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ)–1726, స్టెనోగ్రాఫర్‌ –163, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)–1931 ఖాళీలు ఉన్నాయి.

* తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే ఏపీలో మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. వీటిలో యూడీసీ (07), ఎంటీఎస్ (26), స్టెనో (02) పోస్టులు ఉన్నాయి.

* తెలంగాణ‌లో మొత్తం 72 పోస్టుల‌కు గాను యూడీసీ (25), ఎంటీఎస్ (43), స్టెనో (04) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన వాటిలో ఎంటీఎస్‌ పోస్టులకు సంబంధించి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతను పూర్తిచేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

* స్టేనో, యూడీసీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు 18-27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకునే వారు 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాత పరీక్ష, స్కిల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 15-01-2022న ప్రారంభ‌మ‌వుతుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివరి తేదీగా 15-02-2022ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Clock Vastu: గడియారం వాస్తు..! ఇంట్లో సరైన ప్రదేశంలో లేకపోతే చాలా సమస్యలు..

Beauty Tips: హీటింగ్ టూల్స్ వల్ల జుట్టు పాడై పోయిందా..! ఇంట్లోనే నివారణ చర్యలు ప్రారంభించండి..