Beauty Tips: హీటింగ్ టూల్స్ వల్ల జుట్టు పాడై పోయిందా..! ఇంట్లోనే నివారణ చర్యలు ప్రారంభించండి..
Beauty Tips: ప్రస్తుత రోజుల్లో సమయం సరిపోక చాలామంది జుట్టుకి హీటింగ్ టూల్స్ వాడుతున్నారు. దీంతో జుట్టు సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
Beauty Tips: ప్రస్తుత రోజుల్లో సమయం సరిపోక చాలామంది జుట్టుకి హీటింగ్ టూల్స్ వాడుతున్నారు. దీంతో జుట్టు సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వీటివల్ల జుట్టు పొడిబారడంతో పాటు నిస్తేజంగా మారుతాయి. అంతే కాదు అధిక హీటింగ్ టూల్స్ ఉపయోగించడం జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఈ హీటింగ్ టూల్స్ కొంతకాలం జుట్టుని స్టైలిష్‌గా చేస్తాయి కానీ ఫలితాలు చాలా చెడ్డగా ఉంటాయి. హీటింగ్ టూల్స్ కారణంగా జుట్టు మెరుపు క్రమంగా తగ్గుతుంది. ఈ మెరుపును తిరిగి పొందడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఇంట్లోనే సులువైన పద్దతుల ద్వారా జుట్టుని మెరిసేలా చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
1. అవకాడో డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేయడంలో అవోకాడో ఉత్తమమైనది. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును రిపేర్ చేసి మెరిసేలా చేస్తాయి. దీని ప్యాక్‌ని తయారు చేయడానికి అవకాడోను మెత్తగా చేసి అందులో గుడ్డు మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత జుట్టును చల్లటి నీళ్లతో కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
2. ఆలివ్ నూనె ఈ నూనెను సహజ కండీషనర్‌గా పరిగణిస్తారు. ఒక పాత్రలో ఆలివ్ నూనెను వేడి చేసి కొద్దిగా చల్లారిన తర్వాత తలకు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ ను జుట్టుకు కట్టి అరగంట పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కోల్పోయిన మెరుపు తిరిగి వస్తుంది.
3. ఆపిల్ వెనిగర్ ఆపిల్ వెనిగర్‌లో 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక గుడ్డు కలపడం ద్వారా ప్యాక్ రెడీ అవుతుంది. దీనిని జుట్టుకి అప్లై చేసి అరగంట పాటు ఉంచాలి. తర్వాత షాంపూతో కడిగితే సరిపోతుంది.
4. అలోవెరా జెల్ అలోవెరా జుట్టు చికిత్సకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. అలోవెరా జెల్‌ను నేరుగా జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. కలబంద జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది.