గుడ్‌న్యూస్..! టాటాకంపెనీ ఈ కార్లపై 85,000 వరకు తగ్గింపు అందిస్తోంది..
TaTa Dealerships: జనవరిలో టాటా డీలర్‌షిప్‌లు పలు మోడళ్లపై తగ్గింపులు, అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ మోడళ్లలో
TaTa Dealerships: జనవరిలో టాటా డీలర్‌షిప్‌లు పలు మోడళ్లపై తగ్గింపులు, అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ మోడళ్లలో సఫారి SUV, టిగోర్ కాంపాక్ట్ సెడాన్, Tiago, Altroz హ్యాచ్‌బ్యాక్, Nexon, కాంపాక్ట్ SUV ఉన్నాయి. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి అవకాశం. కంపెనీ కారుపై రూ.85000 నుంచి రూ.10,0000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త టాటా కారును కొనుగోలు చేసేటప్పుడు మీరు బాగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇటీవల విడుదల చేసిన టాటా పంచ్ SUV తగ్గింపు జాబితాలో చేర్చలేదు. డిస్కౌంట్ కింద లభించే మోడళ్ల ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
1. టాటా హారియర్ రూ.85,000 వరకు తగ్గింపు టాటా MG హెక్టర్ ప్రత్యర్థి, హారియర్ 170hp, 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ నెలలో 2021 మోడల్ ఇయర్ హారియర్‌ను రూ.60,000 వరకు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పొందవచ్చు. 2022 హారియర్ రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. ఇది కాకుండా హారియర్‌పై రూ. 25,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉంది.
2. టాటా సఫారిపై రూ.60,000 వరకు తగ్గింపు టాటా సఫారి కూడా హారియర్ మాదిరే ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో 170hp, 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఫ్లాగ్‌షిప్ SUV ఆరు, ఏడు సీట్ల ఎంపికలలో వస్తుంది. మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కాజర్‌లతో పోటీపడుతుంది. కొనుగోలుదారులు 2021 సఫారి అన్ని వేరియంట్‌లపై ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.60,000 వరకు నగదు తగ్గింపును పొందవచ్చు. 2022 మోడల్ సంవత్సరానికి కొనుగోలుదారులు రూ.40,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
3. టాటా టిగోర్‌పై రూ.35,000 వరకు తగ్గింపు టాటా టిగోర్ అనేది మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ వంటి పెద్ద స్టైలిష్ కాంపాక్ట్ సెడాన్. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జత చేయగల 86hp, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. డీలర్‌షిప్‌లు 2021 టిగోర్స్‌పై, 2022 టిగోర్స్‌పై రూ. 25,000, రూ. 20,000 వరకు నగదు తగ్గింపులు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లను అందిస్తున్నాయి. అలాగే ఆఫర్‌పై రూ.10,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఉంది.
4. టాటా టియాగోపై రూ. 30,000 వరకు తగ్గింపు టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ యాంత్రికంగా టిగోర్ సెడాన్‌ను పోలి ఉంటుంది. హ్యుందాయ్ శాంట్రో మారుతి సుజుకి వాగన్ఆర్ ప్రత్యర్థి అయిన టియాగో గ్లోబల్ ఎన్‌సిఎపి నుంచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. 2021 మోడల్ ఇయర్ టియాగో రూ. 25,000 ప్రయోజనాలతో అందించబడుతుండగా, 2022 మోడల్‌కు రూ. 20,000 ప్రయోజనాలు లభిస్తాయి. ఈ నెలలో టియాగోపై రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు కూడా ఉంది.
5. Tata Nexonపై రూ. 25,000 వరకు తగ్గింపు టాటా నెక్సాన్ 110hp, 1.5-లీటర్ టర్బో-డీజిల్, 120hp, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. ఈ రెండూ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇది హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి SUVలతో పోటీపడుతుంది. కొనుగోలుదారులు ఈ నెల 2021 నెక్సాన్ డీజిల్‌పై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. ఇది కాకుండా నెక్సాన్ పెట్రోల్‌పై రూ. 5,000, నెక్సాన్ డీజిల్‌పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది.