Indigo Flight: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఇండిగో ఎయిర్‌లైన్స్ 20% విమానాలు రద్దు..
Indigo Flight: ఇండిగో ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా అనేక
Indigo Flight: ఇండిగో ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా అనేక విమాన సేవలను రద్దు చేసింది. కోవిడ్ కారణంగా 20 శాతం విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. జనవరి 31 వరకు ప్రయాణీకుల నుంచి ఎటువంటి మార్పు రుసుము వసూలు చేయబోమని కంపెనీ తెలిపింది . ప్రయాణీకులు కావాలనుకుంటే వారి అవసరాన్ని బట్టి అదే డబ్బుతో జనవరి 31 వరకు ఇతర ఏదైనా విమానంలో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. దీని కోసం ఎటువంటి మార్పు రుసుము ఉండదని స్పష్టం చేసింది.
వాస్తవానికి ప్రయాణీకుడు ఒక ఫ్లైట్‌కు బదులుగా వేరే తేదీకి మరో టికెట్ తీసుకున్నప్పుడు అతను కొంత రుసుమును చెల్లించాలి. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ ఫీజును జనవరి 31 వరకు మినహాయించింది. ఫ్లైట్ క్యాన్సిల్ అయిన తర్వాత వారు మరేదైనా విమానానికి టికెట్ బుక్ చేస్తారా లేదా అనేది ప్రయాణీకుల ఇష్టం. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి సౌకర్యాన్ని ప్రారంభించింది. జనవరి 31 వరకు ఎలాంటి మార్పు రుసుమును వసూలు చేయదు. పెరుగుతున్న ఇన్ఫెక్షన్, కరోనా కేసుల దృష్ట్యా పెద్ద సంఖ్యలో ఇండిగో కస్టమర్లు ప్రయాణాలను మార్చుకుంటున్నారు.
కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇండిగో ఎయిర్‌లైన్స్ మార్పు రుసుమును మాఫీ చేస్తోంది. కొత్త, ఇప్పటికే ఉన్న వినియోగదారులందరికీ జనవరి 31 వరకు ఉచిత మార్పును అందిస్తోంది. ఓమిక్రాన్ కారణంగా డిమాండ్ తగ్గిందని దీంతో కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని ఈ విమానయాన సంస్థ తెలిపింది. ప్రస్తుత షెడ్యూల్‌లో 20 శాతం విమాన సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంటే ప్రస్తుతం నడుస్తున్న విమాన సర్వీసుల్లో దాదాపు 20 శాతం రద్దవుతున్నాయి.