- Telugu News Photo Gallery Viral photos Large bird hit the plane and crash window pics will shock photos viral
Bird Hit Plane: విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. ఉలిక్కి పడ్డ ప్రయాణికులు.. ఫొటోలు చూస్తే షాక్..
Bird Hit Plane: ఒక విమానాన్ని పక్షి ఢీ కొంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా.. కానీ ఇది నిజం.. రన్నింగ్‌లో ఉన్న విమానాన్ని
Updated on: Jan 09, 2022 | 7:03 PM

ఒక విమానాన్ని పక్షి ఢీ కొంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా.. కానీ ఇది నిజం.. రన్నింగ్‌లో ఉన్న విమానాన్ని ఓ పక్షి ఢీ కొనడంతో విమానం కిటికీ చిత్తు చిత్తు అయింది.

ఇది గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా భయపడ్డారు. పక్షి ఎలా విమానాన్ని ఢీ కొట్టిందని ఆశ్చర్యపోయారు. పక్షి వేగానికి విమానం కిటికీ చిత్తు చిత్తు అయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.

జెట్‌స్ట్రీమ్ 41 విమానం దక్షిణాఫ్రికాలో ల్యాండ్ కానుంది. కానీ ఒక్కసారిగా పక్షి ఢీకొనడంతో పేలుడు సంభవించినట్లు శబ్దం వచ్చింది. ఈ విమానంలో చాలా నష్టం జరిగింది. కిటికీతో పాటు విమానం లోపల కిటికీల క్లాత్‌లు చినిగిపోయాయి.

అయితే ఇప్పుడు ఈ ప్రమాదంలో ద్వంసమైన విమానం కిటీకీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఒక పక్షికి ఇంత బలం ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది పక్షి బలం అనేదానికంటే దాని వేగం వల్ల జరిగిందని చెప్పవచ్చు.





























