AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ నటించిన 'బుజ్జిగాడు' సినిమాలో త్రిషతో పాటు  నటించిన మరో హీరోయిన్ సంజనా గల్రానీ

Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..
Sanjana
Basha Shek
|

Updated on: Jan 10, 2022 | 8:34 AM

Share

యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో త్రిషతో పాటు  నటించిన మరో హీరోయిన్ సంజనా గల్రానీ.. ఆ సినిమాలో వచ్చిరానీ తెలుగు భాష మాట్లాడుతూ ఆకట్టుకుందీ అందాల తార. ఈ సినిమా తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘దుశ్శాసన’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది. కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ గతేడాది కొన్ని వివాదాల్లో చిక్కుకుంది.  శాండల్ వుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయి, మూడు నెలల పాటు  జైలు జీవితం  అనుభవించింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె అజీజ్‌ బాషా అనే వ్యక్తితో పెళ్లిపీటలెక్కింది.  ఆపై  గల్రానీ కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించింది.  ఈక్రమంలో వారి దాంపత్య బంధానికి గుర్తుగా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుందీ ముద్దుగుమ్మ.

‘నేను ఇప్పుడు 5 నెలల గర్భంతో ఉన్నాను. కడుపుతో ఉన్నానని విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదు. ప్రసవం అయ్యేంతవరకు శ్రమించాలనుకుంటున్నాను. పలువురు మహిళలు తమ ప్రసవం తేదీ సమీపం వరకు పనులు చేయడం నేను చూశాను. నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను ‘ అని చెప్పుకొచ్చింది సంజన. కాగా ఇటీవల ఆమె భర్తతో విడిపోనుందని, విడాకులు తీసుకుంటుందన్న వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై మండిపడిన ఆమె తన వైవాహిక జీవితం చాలా బాగుందని, తన  వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని  హెచ్చరించింది . అంతేకాదు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంది. ఇక సినిమాల విషయానికొస్తే తమిళంలో ఒక సినిమా చేస్తుందీ అందాల తార.

Also Read:

Silver Price Today: దేశంలో స్థిరంగా వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Prasar Bharati Recruitment: జ‌ర్న‌లిజంలో డిగ్రీ చేసిన వారికి కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..