Prasar Bharati Recruitment: జర్నలిజంలో డిగ్రీ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
Prasar Bharati Recruitment: ప్రసార భారతి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి సెక్రటేరియట్ కార్యాలయం..
Prasar Bharati Recruitment: ప్రసార భారతి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి సెక్రటేరియట్ కార్యాలయం కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్ మీడియాలో డిగ్రీ/ డిప్లొమా చేసి ఉండాలి.
* అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. అలాగే పాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో నైపుణ్యత ఉండాలి.
* అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ. 55,000 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Coronavirus: బండ్లగణేశ్‌ను వదలనంటోన్న కరోనా.. మూడోసారి మహమ్మారి బారిన పడినట్లు ట్వీట్..
Suriya & Karthi : క్రేజీ మల్టీస్టార్ మూవీకి ప్లాన్ జరుగుతుందట.. సూర్య- కార్తీ ఫ్యాన్స్‌కు పండగే..