Suriya & Karthi : క్రేజీ మల్టీస్టార్ మూవీకి ప్లాన్ జరుగుతుందట.. సూర్య- కార్తీ ఫ్యాన్స్‌కు పండగే..
తమిళ్ స్టార్ హీరోలు సూర్య ఆయన సోదరుడు కార్తీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన సవసరం లేదు. తెలుగులోనూ ఈ ఇద్దరికీ మంచి మార్కెట్ ఉంది.
Suriya & Karthi : తమిళ్ స్టార్ హీరోలు సూర్య ఆయన సోదరుడు కార్తీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన సవసరం లేదు. తెలుగులోనూ ఈ ఇద్దరికీ మంచి మార్కెట్ ఉంది. సూర్య కార్తీ సినిమాలు తెలుగులో విడుదలవుతూ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక సూర్య గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అయ్యారు. ఆ సమయంలో విడుదలైన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఆ సమయంలోనే సుధ కొంగరు దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీహద్దు రా సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈసినిమా భారీ విజయాన్ని సొంత, చేసుకుంది. ఈ సినిమాలో సూర్య నటనకు మరోసారి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. అలాగే రీసెంట్ గా జై భీమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక కార్తీ విషయాని కొస్తే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆకట్టుకుంటున్నాడు కార్తీ. సాధ్యమైనంత వరకూ రొటీన్ కి భిన్నంగా ఉండే కథలను చేయడానికే ఆసక్తిని చూపుతున్నారు ఈ ఇద్దరు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరూ కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తమిళ రీమేక్ లో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ , రానా ఇద్దరు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తమిళ రీమేక్ లో సూర్య, కార్తీ నటించడం లేదని తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కథ విన్నారని .. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.
మరిన్నిఇక్కడ చదవండి :