Ashok Galla: నేనేమీ నాచురల్ డ్యాన్సర్‌ని కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అశోక్ గల్లా..

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా క‌థానాయ‌కుడిగా పరిచయమ‌వుతున్న చిత్రం

Ashok Galla: నేనేమీ నాచురల్ డ్యాన్సర్‌ని కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అశోక్ గల్లా..
Ashok
Follow us

|

Updated on: Jan 09, 2022 | 8:46 PM

Ashok Galla: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా క‌థానాయ‌కుడిగా పరిచయమ‌వుతున్న చిత్రం `హీరో`. నిధి అగర్వాల్ హీరోయిన్‌. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మీడియాతో ముచ్చటించారు.  అశోక్ గల్లా మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమాను చేస్తున్నామని డైరెక్టర్ ముందే చెప్పారు. ఎక్కువగా చిరంజీవి గారి సినిమాలను రిఫరెన్స్‌గా ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు. కథ గురించి ఇప్పుడే నేను ఎక్కువగా చెప్పలేను కాని ట్విస్ట్‌లోనే ఈ సినిమా టైటిల్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది. రేపు రిలీజ‌య్యాక‌ ఈ సినిమాకు హీరో టైటిల్ పర్ఫెక్ట్ అని అంతా అంటారు అని అన్నాడు అశోక్.

నేను శ్రీరామ్ ఆదిత్య గారిని దర్శకుడిగా ఎంచుకోలేదు. మేం ఇద్దరం ఒకరినొకరు ఎంచుకున్నాం. ఇద్దరం కలిసి సినిమాను చేయాలని అనుకున్నాం. ఆయన నన్ను హీరోగా ఎంచుకోవడం నా అదృష్టం. నన్ను చూశారు.. అబ్బాయి నచ్చాడు అని చెప్పారు. ఏ సినిమాలు ఇష్టమని అడిగారు. అలా ఓ ఆరు గంటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. చివరకు సినిమా చేసేద్దామని అన్నారు. శ్రీరామ్ ఆదిత్య గారి సినిమాలు, ఆయన తెరకెక్కించే విధానం అన్నీ బాగుంటాయి. ఆయనేంటో నాకు తెలుసు. స్టోరీ నచ్చింది, మేం కనెక్ట్ అయ్యాక నేనేం ఆలోచించలేదు. అంతా ఆయనే చూసుకుంటాడని అనుకున్నాను. ఇక ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి.. హీరో అవ్వాలని అనుకుంటాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడు మనమే తోపు అని అనుకునే కారెక్టర్ నాది ఈ సినిమాలో. ఇక నేను ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. నా డెబ్యూ మూవీ అని మాత్రమే చూశాను. తాత‌య్య కృష్ణ, మహేష్ బాబు గారి లెగసీని కంటిన్యూ చేద్దామనే. డ్యాన్స్, యాక్షన్‌లోట్రైనింగ్ తీసుకున్నాను. నాకు మామూలుగా అయితే యాక్టింగ్ అంటేనే ఇష్టం. నేనేమీ నాచురల్ డ్యాన్సర్‌ని కాదు. జిమ్‌కు వెళ్లడం అంటే ఇష్టం ఉండదు. కానీ నాకున్న లెగసీ కోసమే ఇవన్నీ నేర్చుకున్నాను.

చిన్నప్పటి నుంచి థియేటర్ ఆర్ట్స్ చేశాను. కాలేజ్‌లో నాకు ఫిల్మ్ డిగ్రీ ఉంది. నాకు ఏడు ఎనిమిదేళ్లున్న సమయంలోనే తాతగారు ఓ సినిమాలో పెట్టారు. నాని సినిమాలో కూడా నటించాను. అప్పుడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. సింగపూర్‌లో థియేటర్ క్లాస్‌లు చేస్తుంటే అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా సినిమా ఫైనల్ కాపీ రాలేదు. వచ్చాక కృష్ణ గారు, మహేష్ బాబు గారు చూస్తారు. నాకు చిన్నప్పటి నుంచి బ్యాట్ మాన్ అంటే ఇష్టం. జోకర్ తెలీకుండా ఉంటుందా?. సినిమాలో జోకర్ పార్ట్ కొద్దిగా చేశారు. కానీ దానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అలాగే సినిమా వాళ్ల జీవితం ఎలా ఉంటుందో అమ్మకు తెలుసు. ఒకరోజు సక్సెస్ ఉంటుంది. ఇంకోరోజు సక్సెస్ ఉండదు. ఎత్తుపల్లాలుంటాయి అవసరమా? అని అమ్మ భయపడ్డారు. నాన్న కూడా అలానే అన్నారు. కానీ నేను ఒక్కసారిగా నా నిర్ణయం గట్టిగా చెప్పడంతో వారు కూడా సపోర్ట్ చేశారు అని చెప్పుకొచ్చాడు అశోక్ .

మరిన్నిఇక్కడ చదవండి : 

Jr.NTR: ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్.. స్మార్ట్ లుక్‏లోకి మారిన తారక్..

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..

Anupama Parameswaran: క్యూట్ క్యూట్ గా ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్…