Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజు ఈ 5 పండ్లు తినాలి..! అవేంటంటే..?

Cholesterol: ఆధునిక కాలంలో చాలామంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జీవన శైలిలో మార్పుల కారణంగా

Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజు ఈ 5 పండ్లు తినాలి..! అవేంటంటే..?
Cholesterol
Follow us
uppula Raju

|

Updated on: Jan 10, 2022 | 7:44 PM

Cholesterol: ఆధునిక కాలంలో చాలామంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జీవన శైలిలో మార్పుల కారణంగా ఇది జరుగుతుంది. ముఖ్యంగా సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే పెరిగిన కొలస్ట్రాల్‌ తగ్గించాలంటే వ్యాయామంతో పాటు ప్రతిరోజు ఈ ఐదు పండ్లని తీసుకోవాలి. అయితే అధికంగా తీసుకోకూడదు. మితంగా తినాలి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆ పండ్లేంటో తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీలు: స్టా బెర్రీలు అత్యంత రుచికరమైన పండ్లు. వీటిని సౌందర్య సాధనాలలో కూడా వాడుతారు. తియ్యగా ఉన్న స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున చర్మానికి గ్లో తెస్తుంది.

యాపిల్స్: యాపిల్స్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దుకు వెళ్లనవసరం లేదని అంటారు. ఇది నిజమే. ఇందులో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, ద్రాక్ష మొదలైనవి సిట్రస్ జాతికి చెందిన పండ్లు. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా చలికాలంలో లభిస్తాయి. ఈ పండ్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

ద్రాక్ష: శీతాకాలపు చిరుతిండి కోసం చూస్తున్నారా? అందుక ద్రాక్ష బెస్ట్‌. ఈ చిన్న ఆకుపచ్చ మెత్తని పండ్లు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. ఇవి బరువు తగ్గించడానికి సహాయం చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ద్రాక్ష ఎలా సహాయపడుతుందో పలు అధ్యయనాలు నిరూపించాయి.

అవోకాడో: కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా అవోకాడో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయనే అపోహతో దూరంగా ఉంటారు. కానీ USDA ప్రకారం.. అవోకాడోలో 0 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చు. అదనంగా ఇది ఆరోగ్యకరమైన కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది.

Omicron: ఒమిక్రాన్‌తో పోరాడాలంటే ఇవి మీ డైట్‌లో ఉండాల్సిందే.. లేదంటే వైరస్‌ ముప్పు తప్పదు..?

కొత్త ఉద్యోగులకు శుభవార్త.. ఆ పథకం ప్రయోజనం పొడగించారు.. ఎప్పటివరకంటే..?

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..! వచ్చే నెల నుంచి వీరు అధికంగా చెల్లించాల్సిందే..?