కొత్త ఉద్యోగులకు శుభవార్త.. ఆ పథకం ప్రయోజనం పొడగించారు.. ఎప్పటివరకంటే..?

ABRY: ఈ విషయం ఉద్యోగులకు శుభవార్తే అని చెప్పాలి. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ABRY కింద

కొత్త ఉద్యోగులకు శుభవార్త.. ఆ పథకం ప్రయోజనం పొడగించారు.. ఎప్పటివరకంటే..?
Da Employees
Follow us
uppula Raju

|

Updated on: Jan 10, 2022 | 6:35 PM

ABRY: ఈ విషయం ఉద్యోగులకు శుభవార్తే అని చెప్పాలి. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ABRY కింద రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని పొడగిస్తున్నట్లు ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో “#ABRY కింద రిజిస్ట్రేషన్ సౌకర్యం 31.03.2022 వరకు పొడిగించబడింది.” అని ఉంది. ఇంతకుముందు ఈ రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూన్ 30, 2021 వరకు ఉండేది. అయితే ఇప్పుడు అది మార్చి 31, 2022 వరకు పొడిగించారు. labour.gov.inకు లాగిన్ అవడం ద్వారా ABRY గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు. ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి, ఉపాధి కల్పనను పెంచడానికి, సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు కొత్త ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి, ఉపాధి నష్టాన్ని పునరుద్ధరించడానికి ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీలో భాగంగా ABRY ప్రవేశపెట్టారు.

ఈ పథకం ముఖ్యాంశాలు

1) EPFOలో నమోదు చేసుకున్న అర్హతగల సంస్థల యజమానులు, కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహకం అందిస్తుంది.

2) కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు ప్రోత్సాహకాన్ని అందుకుంటారు.

3) చెల్లింపు రూపంలో ప్రోత్సాహకం అందిస్తారు.

ఎ) ఉద్యోగులు, యజమానుల సహకారం.. అంటే 1000 మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో కొత్త ఉద్యోగులకు సంబంధించి వేతనంలో 24 శాతం

బి) ఉద్యోగులు మాత్రమే EPF అంటే 12 శాతం 1000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో కొత్త ఉద్యోగులకు సంబంధించి వేతనాల శాతం

6) రూ. 15000 కంటే తక్కువ నెలవారీ వేతనంతో చేరిన కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 24 వేతన నెలల వరకు ప్రయోజనాలను పొందేందుకు అర్హులు.

7) అక్టోబర్ 1, 2020 తర్వాత EPFOలో రిజిస్టర్ చేసిన సంస్థలు, కొత్త ఉద్యోగులందరు ప్రయోజనాలను పొందుతారు.

8. EPF చట్టం 1952 కింద కొత్త ఉద్యోగులు, కొత్త సంస్థలు 31 మార్చి 2022 వరకు నమోదు చేసుకోవడానికి అర్హులు. మరింత సమాచారం కోసం epfindia.gov.in అధికారిక EPFO ​​వెబ్‌సైట్‌ని సందర్శించండి.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..! వచ్చే నెల నుంచి వీరు అధికంగా చెల్లించాల్సిందే..?

రుద్రాక్ష శివుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది..! మీ రాశి ప్రకారం ధరిస్తే అదృష్టం మీ వెంటే..?

Booster Dose: బూస్టర్‌ డోస్‌ కోసం ఈ 3 వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి.. తాజా వివరాలు తెలుసుకోండి..