రుద్రాక్ష శివుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది..! మీ రాశి ప్రకారం ధరిస్తే అదృష్టం మీ వెంటే..?

Rudraksha: శివుడి అనుగ్రహం పొందడానికి రుద్రాక్షను మించినది మరొకటి లేదు. శివభక్తులు దీనిని మహాదేవుడి పూజలో సమర్పించడమే కాకుండా

రుద్రాక్ష శివుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది..! మీ రాశి ప్రకారం ధరిస్తే అదృష్టం మీ వెంటే..?
Rudraksh Rashi
Follow us
uppula Raju

|

Updated on: Jan 10, 2022 | 3:50 PM

Rudraksha: శివుడి అనుగ్రహం పొందడానికి రుద్రాక్షను మించినది మరొకటి లేదు. శివభక్తులు దీనిని మహాదేవుడి పూజలో సమర్పించడమే కాకుండా వాటిని మహాప్రసాదంగా భావించి ధరిస్తారు. రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రుద్రాక్ష శుభ ఫలితాలను ఇస్తుందని పురాణాలలో చెప్పారు. రుద్ర పురాణం ప్రకారం రుద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి.

రుద్రాక్ష రకాలు

శివుని అనుగ్రహాన్ని కలిగించే అనేక రకాల రుద్రాక్షలు ఉన్నాయి. వివిధ పరిమాణాలు, వివిధ చారలతో ఉంటాయి. రుద్రాక్ష దేవతలు, నవగ్రహాలకు సంబంధించినది. ఈ రుద్రాక్షలలో ప్రతి ఒక్కటి విభిన్నమైన గుణాన్ని కలిగి ఉంటుంది. వివిధ రాశుల వారు వివిధ రకాల రుద్రాక్షలను ధరించాలనే నియమం ఉండటానికి కారణం ఇదే.

రాశిచక్రం ప్రకారం రుద్రాక్ష

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాలకు సంబంధించిన రత్నాల వలె శివుని అనుగ్రహాన్ని ఇచ్చే రుద్రాక్ష కూడా ఒక వ్యక్తి దురదృష్టాన్ని అదృష్టంగా మార్చగలదు. ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కోసం మీ రాశిచక్రం ప్రకారం రుద్రాక్షను ధరిస్తే మంచిది. 12 రాశుల వారికి ఏ రుద్రాక్ష శుభప్రదమో తెలుసుకుందాం.

1. మేషరాశి రుద్రాక్ష

మేష రాశి వారు అదృష్టం కోసం ఒక ముఖి, మూడు ముఖి లేదా ఐదు ముఖి రుద్రాక్షలను ధరించాలి.

2. వృషభరాశి రుద్రాక్ష

వృషభ రాశి వారు సుఖ సంతోషాలు కలగాలంటే చతుర్ముఖ, షట్ ముఖాలు లేదా పద్నాలుగు ముఖాలు గల రుద్రాక్షలను పూజించి ధరించాలి.

3. మిథునరాశి రుద్రాక్ష

మిథున రాశి వారు ఎల్లప్పుడూ నాలుగు ముఖాలు, ఐదు ముఖాలు, పదమూడు ముఖాల రుద్రాక్షలను ప్రతిష్టించిన తర్వాత ధరించాలి.

4. కర్కాటక రాశి రుద్రాక్ష

కర్కాటక రాశి వారు మూడు ముఖాలు, ఐదు ముఖాలు లేదా గౌరీ-శంకర్ రుద్రాక్షలను పూజించిన తర్వాత ధరించాలి.

5. సింహరాశి రుద్రాక్ష

ఒక ముఖి, మూడు కియా ముఖి, ఐదు ముఖి రుద్రాక్షలు సింహ రాశి ప్రజల అదృష్టాన్ని పెంచడానికి చాలా శుభప్రదమైనవి

6. కన్య రాశి రుద్రాక్ష

కన్యా రాశి వారికి నాలుగు ముఖాలు, ఐదు ముఖాలు, పదమూడు ముఖాల రుద్రాక్షను ధరించడం చాలా శుభప్రదం.

7.తులారాశి రుద్రాక్ష

తులారాశి వారు అదృష్టాన్ని పొందడానికి నాలుగు ముఖాలు, ఆరు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించాలి.

8. వృశ్చిక రాశి రుద్రాక్ష

వృశ్చిక రాశికి చెందిన వ్యక్తి తన నిద్రావస్థను మేల్కొల్పడానికి మూడు ముఖాలు, ఐదు ముఖాలు లేదా గౌరీ-శంకర్ రుద్రాక్షను ధరించాలి.

9. ధనుస్సు రాశి రుద్రాక్ష

ధనుస్సు రాశి వారు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఒక ముఖి, మూడు ముఖి లేదా ఐదు ముఖి రుద్రాక్షలను ధరించాలి.

10. మకరరాశి రుద్రాక్ష

మకరరాశి వారు అదృష్టాన్ని పెంపొందించుకోవడానికి ఎల్లప్పుడూ నాలుగు ముఖాలు, ఆరు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్షను ధరించాలి.

11. కుంభరాశి రుద్రాక్ష

కుంభ రాశి వారు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి నాలుగు ముఖి, ఆరు ముఖి లేదా 14 ముఖి రుద్రాక్షలను ధరించాలి.

12. మీనరాశి రుద్రాక్ష

మీన రాశి ప్రజలు ఎల్లప్పుడూ మూడు ముఖాలు, ఐదు ముఖాలు లేదా గౌరీ-శంకర్ రుద్రాక్షలను ధరించాలి

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకులను ఉద్దేశించి రాయడం జరిగింది.

క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డ్‌ ఇదేనేమో..! వరుసగా 10 ఇన్సింగ్స్‌ల్లో సున్నా పరుగులే..?

ఒక విచిత్రం..! ఈ గ్రామంలోని ప్రజలు నడుస్తూ, మాట్లాడుతూ ఆటోమేటిక్‌గా నిద్రపోతారు..?

షాకింగ్‌.. ఆ సంవత్సరం నుంచి మనుషులు 180 ఏళ్లు జీవిస్తారట..! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?