AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..! వచ్చే నెల నుంచి వీరు అధికంగా చెల్లించాల్సిందే..?

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ తన ఖాతాదారులకు షాక్‌ నిచ్చింది. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డు వినియోగదారుల ఛార్జీలు పెంచనుంది. ఈ పెంచిన ఛార్జీలు

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..! వచ్చే నెల నుంచి వీరు అధికంగా చెల్లించాల్సిందే..?
Icici
uppula Raju
|

Updated on: Jan 10, 2022 | 5:57 PM

Share

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ తన ఖాతాదారులకు షాక్‌ నిచ్చింది. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డు వినియోగదారుల ఛార్జీలు పెంచనుంది. ఈ పెంచిన ఛార్జీలు ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు ఖాతాదారులకు మెస్సేజ్‌లు కూడా పంపించింది. అయితే ఎలాంటి లావాదేవీలకు ఎంత మేరకు వసూలు చేస్తారో తెలుసుకుందాం. ఫిబ్రవరి 10, 2022 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులు నగదు అడ్వాన్స్ మీద లావాదేవీ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. కనీసం రూ.500 చొప్పున వసూలు చేస్తామని ఐసీఐసీఐ పేర్కొంది.

అలాగే చెక్‌ రిటర్న్‌ అయినా, ఆటో డెబిట్‌ ఫెయిల్‌ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఫీజుగా వసూలు చేయనున్నారు. రూ.50వేల పైన ఎంత మొత్తమైనా గరిష్టంగా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న చార్జీలతో పాటు అదనంగా మరో రూ.50+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్‌ క్రెడిట్‌ కార్డులకు ఈ ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు.

ఇటీవల హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా కస్టమర్లకు పంపే మెస్సేజ్‌లకి చార్జ్‌ చేస్తుంది. ఈ బ్యాంకు ఖాతాదారులు ఇప్పుడు ఒక మెస్సేజ్‌కి 20 పైసలు, జీఎస్టీ చెల్లించాలి. ఈ సర్వీస్‌కి బ్యాంక్ ఇన్‌స్టా అలర్ట్ సర్వీస్ అని పేరు. దీని ద్వారా ఖాతాదారులకు మెస్సేజ్‌లు, ఈ-మెయిల్‌ల ద్వారా సమాచారం అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ కొత్త రూల్ గురించి తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఒక త్రైమాసికంలో ఇన్‌స్టా అలర్ట్ సేవలకు 3 రూపాయలు ఛార్జీ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఒక్కో మెసేజ్‌కు 20 పైసలు, జీఎస్టీ కలిపి వసూలు చేస్తారు.

Samsung Galaxy S21 FE 5G ఫోన్ విడుదల.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే..?

Booster Dose: బూస్టర్‌ డోస్‌ కోసం ఈ 3 వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి.. తాజా వివరాలు తెలుసుకోండి..

రుద్రాక్ష శివుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది..! మీ రాశి ప్రకారం ధరిస్తే అదృష్టం మీ వెంటే..?