Samsung Galaxy S21 FE 5G ఫోన్ విడుదల.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే..?

Samsung: దాదాపు ఏడాది పాటు నిరీక్షించిన తర్వాత శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ విడుదలైంది. ఇండియన్‌ మార్కెట్‌లో వెనిలా వేరియంట్ ధ

Samsung Galaxy S21 FE  5G ఫోన్ విడుదల.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే..?
Samsung Galaxy S21 Fe
Follow us
uppula Raju

|

Updated on: Jan 10, 2022 | 5:11 PM

Samsung: దాదాపు ఏడాది పాటు నిరీక్షించిన తర్వాత శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ విడుదలైంది. ఇండియన్‌ మార్కెట్‌లో వెనిలా వేరియంట్ ధర రూ.49,999గా నిర్ణయించింది. Galaxy S20 FE కొత్త లైనప్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, ఇంటర్నల్‌ Exynos 2100 సిలికాన్, 8GB వరకు RAM కలిగి ఉంది. ఈ మొబైల్‌ కోసం ముందస్తు బుకింగ్‌లు కొన్ని రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ జనవరి 11 నుంచి శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ఈ-రిటైల్ సైట్ అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌ల గురించి చెప్పాలంటే Samsung HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ కొత్త పోన్ వైట్, గ్రాఫైట్, ఆలివ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

సరికొత్త Galaxy S21 FE 5G రెండు వేరియంట్‌లలో లభిస్తుంది ఒకటి 8GB/128GB స్టోరేజ్, దీని ధర రూ. 49,999. రెండోది 8GB/256GB స్టోరేజ్ రూ.53,999కి అందుబాటులో ఉంటుంది. Samsung Galaxy S21 FE 5G శక్తివంతమైన 6.4-అంగుళాల AMOLED 2X డిస్‌ప్లేతో వస్తుంది. ప్యానెల్ మృదువైన స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది 8GB RAM, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. భద్రత కోసం, ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌ ఉంటుంది.

12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 MP టెలిఫోటో లెన్స్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ వంటి మూడు సెటప్‌లను ప్యాక్ చేసే నిలువు కెమెరా మాడ్యూల్‌లో అందిస్తున్నారు. మీరు సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పొందుతారు. కెమెరా సాఫ్ట్‌వేర్ మెరుగైన నైట్ మోడ్, 30X స్పేస్ జూమ్, డ్యూయల్-రికార్డింగ్ మోడ్‌ను కలిగి ఉంటుంది. 4,500mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0తో వస్తుంది. కొత్త Samsung Galaxy S21 FE నీటి నిరోధకత కోసం IP68 ధృవీకరణను కలిగి ఉంది. ఇది 7.9mm మందం 177 గ్రాముల బరువు ఉంటుంది.

Booster Dose: బూస్టర్‌ డోస్‌ కోసం ఈ 3 వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి.. తాజా వివరాలు తెలుసుకోండి..

రుద్రాక్ష శివుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది..! మీ రాశి ప్రకారం ధరిస్తే అదృష్టం మీ వెంటే..?

ఒక విచిత్రం..! ఈ గ్రామంలోని ప్రజలు నడుస్తూ, మాట్లాడుతూ ఆటోమేటిక్‌గా నిద్రపోతారు..?

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్