Best Power Banks: పవర్ బ్యాంక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.? అయితే బెస్ట్ ఫీచర్స్‌తో కూడిన వీటిపై ఓ లుక్కేయండి..
Best Power Banks: స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగించే వారు ఎదుర్కునే మొదటి సమస్య ఛార్జింగ్. దీంతో దీనికి చెక్ పెట్టడానికి చాలా మంది పవర్ బ్యాంక్‌లు కొనుగోలు చేస్తారు. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్‌లపై ఓ లుక్కేయండి..
Redmi power bank: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్‌లో రెడ్‌మీ పవర్ బ్యాంక్ మొదటి వరుసలో ఉంటుంది. డబుల్ యూఎస్‌బీతో పాటు 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ పవర్ బ్యాంక్ సొంతం. ఈ పవర్ బ్యంక్ ఇన్‌పుట్ ఛార్జ్ సమయం 7.5 గంటల ఉంటుంది. డ్యూయల్ యూఎస్‌బీలో భాగంగా టైప్‌సీతో పాటు, మైక్రో యూఎస్‌బీ అందించారు. 10,000 ఎమ్ఏహెచ్ కెపాసిటీ దీని సొంతం. ఈ పవర్ బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా రూ. 899కి అందుబాటులో ఉంది.
1 / 5
Croma power bank: ఈ పవర్ బ్యాంక్‌తో ఒకేసారి రెండు డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌ను మైక్రో యూఎస్‌బీ లేదా టైప్‌సీ ఛార్జర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. క్రోమా పవర్ బ్యాంక్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ మీ డివైజ్‌లకు రక్షణ కలిపిస్తుంది.
2 / 5
Realme power bank: ఈ పవర్ బ్యాంక్ 30 వాట్స్ డార్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రూపొందించారు. కేవలం 230 గ్రాముల బరువుతో లైట్‌వెయిట్ పవర్ బ్యాంక్ ఫాస్ట్ ఛార్జింగ్ అవకాశాన్ని కలిపించారు. ఇందులోని లో కరెంట్ ఫీచర్ ద్వారా బ్యూటూత్, హెడ్‌సెట్స్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు. 1000 ఎమ్ఏహెచ్ కెపాసిటీ దీని సొంతం.
3 / 5
Mi pocket power: ఎమ్ఐ పాకెట్ పవర్ బ్యాంక్‌ను చాలా తక్కువ బరువుతో తయారు చేశారు. దీనిని చాలా సులువుగా జేబులో తీసుకెళ్లొచ్చు. 12 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఫీచర్‌తో డివైజ్‌లు ఓవర్ హీటింగ్ కాకుండా జాగ్రత్తలు తీసుకొవచ్చు. 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ పవర్ బ్యాంక్‌తో ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జింగ్ చేసుకోవచ్చు.
4 / 5
OnePlus power bank: 10,000 ఎమ్ఏహెచ్ కెపాసిటీతో కూడిన ఈ పవర్ బ్యాంక్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి రెండు డివైజ్‌లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. 12 లేయర్స్ సర్‌క్యూట్ ప్రొటెక్షన్‌తో డివైజ్‌లకు భద్రత. ఈ పవర్ బ్యాంక్‌ను కేవలం 225 గ్రాముల లైట్ వెయిట్‌తో తయారు చేశారు.