Booster Dose: బూస్టర్‌ డోస్‌ కోసం ఈ 3 వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి.. తాజా వివరాలు తెలుసుకోండి..

Booster Dose: గత కొన్ని రోజులుగా భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీకాల వేగాన్ని పెంచింది.

Booster Dose: బూస్టర్‌ డోస్‌ కోసం ఈ 3 వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి.. తాజా వివరాలు తెలుసుకోండి..
Corona Booster Dose (1)
Follow us
uppula Raju

|

Updated on: Jan 10, 2022 | 4:51 PM

Booster Dose: గత కొన్ని రోజులుగా భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీకాల వేగాన్ని పెంచింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు అందించారు. అదే సమయంలో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లల గురించి మాట్లాడితే ఇప్పటి వరకు 20 మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలకు టీకా వేశారు. ఈ రోజు నుంచి (జనవరి 10) కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లను వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని సన్నాహాలు పూర్తి చేసింది.

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి. అది ముందుగానే తెలుసుకోవాలి. వాస్తవానికి కాక్‌టెయిల్ డోస్ లేదా మిక్స్‌డ్ వ్యాక్సిన్ డోస్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. అందువల్ల బూస్టర్ డోస్‌లో మీరు ఇంతకు ముందు తీసుకున్న వ్యాక్సిన్‌ నే వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఓ చిక్కు ఉంది. భారతదేశంలో బూస్టర్ డోస్‌ల కోసం ఎన్ని వ్యాక్సిన్‌లను అనుమతించారో తెలుసుకోవాలి. అది ప్రభుత్వం ఆమోదించిన వాటిలో ఉందా లేదా అనేది పరిశీలించాలి.

బూస్టర్ డోస్‌ల కోసం 3 వ్యాక్సిన్లకే అనుమతి టీకా అత్యవసర వినియోగానికి సంబంధించినంత వరకు భారతదేశం 8 వ్యాక్సిన్‌లను ఆమోదించింది. ఈ ఎనిమిదింటిలో ఏది కావాలంటే ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. కానీ బూస్టర్ డోస్ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 3 వ్యాక్సిన్‌లను మాత్రమే అనుమతి ఇచ్చింది. ఒకటి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్, రెండోది భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్, మూడోది రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ V పేర్లు ఉన్నాయి. అంటే ఈ మూడు వ్యాక్సిన్‌లలో ఏదైనా రెండు డోసులు ఇప్పటికే తీసుకున్న వ్యక్తులు అదే టీకా బూస్టర్‌ డోస్‌గా తీసుకోవచ్చు. అంతేకానీ మిక్స్‌డ్ వ్యాక్సిన్‌ను పొందే అవకాశం లేదు.

ఇటీవల ప్రభుత్వం కార్బోవాక్స్, కోవోవాక్స్ వినియోగాన్ని కూడా ఆమోదించింది. కానీ ఈ రెండు టీకాలు ఇంకా బూస్టర్ డోస్‌లో చేర్చలేదు. దీనికోసం ఈ రెండు వ్యాక్సిన్‌లను ప్రభుత్వం ఆమోదించవచ్చని మొదట్లో చెప్పారు. కానీ అది జరగలేదు. అందువల్ల ప్రభుత్వ, ప్రైవేట్ డొమైన్‌లలో అనేక రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ మాత్రమే బూస్టర్ డోస్‌లు వేసుకోవాలి. తర్వాత ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం. మీరు ఈ మూడు టీకాలలో దేనినైనా తీసుకున్నట్లయితే సులభంగా బూస్టర్ మోతాదును పొందవచ్చు. మీరు ఈ వ్యాక్సిన్‌లు కాకుండా వేరే ఏదైనా ఒక వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే బూస్టర్ డోస్ కోసం వేచి ఉండక తప్పదు.

రుద్రాక్ష శివుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది..! మీ రాశి ప్రకారం ధరిస్తే అదృష్టం మీ వెంటే..?

క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డ్‌ ఇదేనేమో..! వరుసగా 10 ఇన్సింగ్స్‌ల్లో సున్నా పరుగులే..?

ఒక విచిత్రం..! ఈ గ్రామంలోని ప్రజలు నడుస్తూ, మాట్లాడుతూ ఆటోమేటిక్‌గా నిద్రపోతారు..?