AP Corona: ఏపీలో ఆ మూడు జిల్లాల్లో వందకుపైగా కేసులు.. పూర్తి వివరాలు ఇవే..

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే.. కేసుల సంఖ్య కాస్త తగ్గాయి. ఏపీలో

AP Corona: ఏపీలో ఆ మూడు జిల్లాల్లో వందకుపైగా కేసులు.. పూర్తి వివరాలు ఇవే..
Ap Corona
Follow us

|

Updated on: Jan 10, 2022 | 5:48 PM

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే.. కేసుల సంఖ్య కాస్త తగ్గాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో (ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు) 24,280 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 984 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో రాష్ట్రంలో ఎవరూ మరణించలేదు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,82,843కి చేరగా.. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,505గా ఉంది.

కాగా.. గత 24 గంటల్లో 152 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 20,62,732 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 5,606 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. ఏపీలోని రెండు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. చిత్తూరులో 244 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నంలో 151 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 117 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరులో 81, విజయనగరంలో 75 కేసులు, గుంటూరులో 73 కేసులు చొప్పున నమోదయ్యాయి.

ఇదిలాఉంటే.. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూను విధించింది. రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

థియేటర్లలో 50 శాతం అక్యుపెన్సీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో విడుదల చేశారు. ప్రార్ధనా మందిరాలలో కూడా కోవిడ్ ఆంక్షలు అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి, భౌతిక దూరం వంటి నిబంధనలు ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

Also Read:

Pawan Kalyan: కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది అప్రమత్తంగా ఉండండి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

YS Jagan: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వైద్యశాఖలో 30 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన..