IRCTC/Railway News: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు
Sankranti Special Train: సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు..
Sankranti Special Train – Railway News: సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ఓ సువిధ స్పెషల్ రైలును నడపనున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ ప్రత్యేక రైలు (నెం.82725) ఈ నెల 11న(మంగళవారం) రాత్రి 9 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.50 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్‌ను రైల్వే శాఖ ప్రారంభించింది. పూర్తి రిజర్వేషన్ సర్వీస్‌గా దీన్ని నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఉండనున్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ లేదా నేరుగా రైల్వే బుకింగ్ కేంద్రాల్లో టికెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు. ప్రయాణీకులు పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ప్రత్యేక రైలులో ప్రయాణించాల్సి ఉంటుంది.
సంక్రాంతి ప్రత్యేక రైలుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ట్వీట్..
Sankranti Special Train from #Secunderabad to #Visakhapatnam#Sankranti #SpecialTrains @drmsecunderabad @drmhyb pic.twitter.com/q47R5SeCLB
— South Central Railway (@SCRailwayIndia) January 10, 2022
ఇప్పటికే నాలుగు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన ద.మ.రైల్వే..
ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా నాలుగు సువిధ ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. 12, 13 తేదీల్లో కాచిగూడ నుంచి కాకినాడ టౌన్‌కు.. కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అలాగే సికింద్రాబాద్ -విశాఖపట్నం మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
Four Suvidha Special Trains Between Kacheguda – Kakinada Town – Secunderabad and Secunderabad – Visakhapatnam #Sankranti #SpecialTrains pic.twitter.com/FSIJi9MmKg
— South Central Railway (@SCRailwayIndia) January 9, 2022
పెరిగిన ప్లాట్ ఫాం టిక్కెట్ ధరలు..
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే శాఖ పెంచింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఇది రూ.50గా ఉంటుంది.
Temporary Increase in Platform Ticket Rate during #Sankranti Festival Season w.ef 8th January to 20th January, 2022 as detailed:@drmsecunderabad @drmhyb pic.twitter.com/9RWEUpXWFS
— South Central Railway (@SCRailwayIndia) January 9, 2022
Also Read..
Ticket Booking: త్వరలో ఆన్‌లైన్ టిక్కెటింగ్ వెబ్‌సైట్.. కీలక వివరాలు వెల్లడిచిన మంత్రి పేర్ని నాని..
Rakul Preet Singh : అవును అతనితో ప్రేమలో ఉన్నా.. క్లారిటీ ఇచ్చిన పాలబుగ్గల సుందరి రకుల్..