Balakrishna: మంత్రి హరీష్ రావును కలిసిన బాలకృష్ణ.. ఏ అంశాలపై చర్చించారంటే..
Balakrishna: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంద్రి తన్నీరు హరీష్ రావును నటుడు హిందూపూరం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. అయితే బాలకృష్ణ నటుడిగానో, రాజకీయనాయకుడిగానో కాకుండా...
Balakrishna: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంద్రి తన్నీరు హరీష్ రావును నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. అయితే బాలకృష్ణ నటుడిగానో, రాజకీయనాయకుడిగానో కాకుండా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హోస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ హోదాలో మంత్రితో సమావేశమయ్యారు.
సమావేశంలో భాగంగా.. బాలకృష్ణ పలు విషయాలపై చర్చించారు. క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తోన్న సేవలు, సంస్థ కార్యకలాపాలను బాలకృష్ణ హరీష్ రావుకు వివరించారు. అదే విధంగా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు బాలకృష్ణ. ప్రభుత్వం నుంచి ఆసుపత్రికి తగిన విధంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ చేసిన విజ్ఞప్తికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. క్యాన్సర్ రోగులకు అధునాతన చికిత్సను అందించే క్రమంలో బసవతారకం ఆసుపత్రిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా పేదలకు చికిత్స అందుబాటులో తేవడానికి తల్లి బసవతారకం పేరు మీద ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి బాలకృష్ణ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఏటా బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలను బసవతారకంలో జరుపుకుంటారన్న విషయం తెలిసిందే.
Also Read: E- Passports: తరచుగా విదేశాలకు ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. త్వరలో ఈ-పాస్‌పోర్ట్..
చూపుతో కుర్రకారును కట్టేసి సుందరి
Mutual Funds: మ్యూచువల్ ఫండ్‌లో కొత్త డెట్ ఇండెక్స్ ఫండ్.. మీరు రూ. 5000తో మొదలు పెట్టండి..