YS Jagan: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వైద్యశాఖలో 30 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన..

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. వైద్యశాఖలో ఖాళీగా...

YS Jagan: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వైద్యశాఖలో 30 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన..
Cm Jagan
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 10, 2022 | 5:39 PM

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం జగన్ తాజాగా వైద్యశాఖపై జరిపిన సమీక్షలో ప్రకటించారు. తాజాగా రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై అధికారులతో చర్చించిన సీఎం జగన్ పలు కీలక విషయాలను వెల్లడించారు.

కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన వివిధ ఆక్సిజన్ సదుపాయాలను ఆయన ప్రారంభించారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయంపై గండి పడినా.. అభివృద్ధి పనుల్లో మాత్రం ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నామన్నారు.  నాడు-నేడు కార్యక్రమం ద్వారా అత్యాధునిక సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు.

74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు, అలాగే రాష్ట్రంలో ఉన్న 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. సెకండ్ వేవ్‌లో ఎదుర్కున్న పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా.. ఇకపై ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.