AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: ఒమిక్రాన్‌తో పోరాడాలంటే ఇవి మీ డైట్‌లో ఉండాల్సిందే.. లేదంటే వైరస్‌ ముప్పు తప్పదు..?

Omicron: దేశంలో రోజు రోజు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో

Omicron: ఒమిక్రాన్‌తో పోరాడాలంటే ఇవి మీ డైట్‌లో ఉండాల్సిందే.. లేదంటే వైరస్‌ ముప్పు తప్పదు..?
Diet To Fight
uppula Raju
|

Updated on: Jan 10, 2022 | 7:19 PM

Share

Omicron: దేశంలో రోజు రోజు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మరోవైపు ప్రభుత్వాలు పాక్షికంగా లాక్‌డౌన్ కూడా విధించాయి. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్క్‌ కచ్చితంగా ధరించాలి. వీటికి తోడు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం రోజువారీ డైట్‌లో కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలు ఉండాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. నెయ్యి: ఇది చాలా తేలికగా జీర్ణమయ్యే కొవ్వులలో ఒకటి. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. మీ రోజువారీ ఆహారంలో నెయ్యి కచ్చితంగా ఉండాలి.

2. ఉసిరి: ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. ఇది అన్ని వ్యాధులను దూరంగా ఉంచుతుంది. రోజూ ఉసిరికాయ లేదా ఉసిరి రసం తీసుకుంటే మంచిది.

3. రాగులు: రాగులలో అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో రాగి, బజ్రా, జొన్న వంటివి తినడం చాలా మంచిది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇవి మీ జీర్ణవ్యవస్థకు మంచిది రక్త ప్రసరణను పెంచుతుంది.

4. అల్లం: ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని నయం చేయడంలో సహాయపడతాయి. జెర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని టీలో చేర్చి ప్రతిరోజు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవచ్చు.

5. పసుపు: ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల దగ్గు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 1 టీస్పూన్ పసుపును తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.

6. తేనె: తేనె జీర్ణక్రియ, గట్ ఆరోగ్యానికి మంచిది. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఓమిక్రాన్‌తో పోరాడటానికి దీన్ని మీ అల్లం టీకి కలుపుకొని తాగవచ్చు.

7. రోజువారీ ఆహారంలో చక్కెర తీసుకోవడం పరిమితం చేయండి ఎందుకంటే ఇది మీ బరువును పెంచుతుంది స్థూలకాయానికి దారితీస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది జాగ్రత్.

Health Tips: కరోనా కాలంలో ప్రతీ ఉదయం ఇది తీసుకోండి.. రోగనిరోధక శక్తికి ఢోకా ఉండదు..!

Milk Side Effects: పాలతో కలిపి ఈ పదార్థాలను తీసుకుంటే మీ పని అంతే ఇక.. ఎందుకో తెలుసుకోండి..

Diabetes Diet: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా..? ఆహారంలో ఇలాంటి మార్పులు చేస్తే మంచిది..