Diabetes Diet: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా..? ఆహారంలో ఇలాంటి మార్పులు చేస్తే మంచిది..

Diabetes Care: చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ డయాబెటిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మధుమేహాన్ని నియంత్రించడానికి బాధితులు మొదట తమ జీవనశైలి, ఆహారంలో

Diabetes Diet: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా..? ఆహారంలో ఇలాంటి మార్పులు చేస్తే మంచిది..
Diabetes Diet
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 09, 2022 | 7:53 AM

Diabetes Care: చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ డయాబెటిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మధుమేహాన్ని నియంత్రించడానికి బాధితులు మొదట తమ జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు. తీసుకునే ఆహారం నుంచి పానీయాల వరకు రక్తంలో చక్కెర స్థాయిపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా శీతాకాలం కొన్ని పద్దతులను అవలంభించడం వల్ల షుగర్ సమస్యను నుంచి కొంత ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు. డయాబెటిక్ సమస్య తీవ్రంగా వేధిస్తుంటే పలు రకాల ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే.. దానిని కొంతవరకు నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

జామపండు- జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్‌ పెరగడాన్ని నివారిస్తుంది. జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌లు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వెంటనే పెరిగే షుగర్‌ స్థాయిని నివారించడానికి వారి ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను చేర్చుకోవాలి.

దాల్చినచెక్క – ఈ మసాలా ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలతో నిండి ఉంది. రక్తంలో గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ రెండింటి స్థాయిని నియంత్రించడంలో దాల్చినచెక్క సహాయపడుతుంది. ఇది మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం కోసం దాల్చినచెక్కను ఉపయోగించడండ మేలు. దీంతోపాటు దాల్చిన చెక్క నీటిని తాగడం మంచిది.

నారింజ – అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు ‘డయాబెటిస్ సూపర్ ఫుడ్స్’. మీరు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీ ఆహారంలో చేర్చుకోవాలి. నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మీరు దీన్ని సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

క్యారెట్లు – పోషకాలు అధికంగా ఉండే క్యారెట్లు మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. క్యారెట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల, డయాబెటిక్ రోగులు దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

లవంగాలు – లవంగాలలో నైజెరిసిన్ మూలకం ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

ఈ పదార్థాలను ఆహారంలో ఏదో ఒక విధంగా తీసుకోవడం ద్వారా డయబెటిక్ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Corona Health Tips: మీరు కరోనా బారిన పడ్డారా..? ఇలా చేయండి త్వరగా కోలుకుంటారు..!

Omicron: మళ్ళీ కరోనా, ఓమిక్రాన్ భయపెడుతున్న వేళ.. రోగనిరోధక శక్తిని ఈ స్మూతితో పెంచుకోండి.. తయారీ విధానం

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా