Health Tips: బిజీలైఫ్‌తో సతమతమవుతున్నారా..? ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
Health care tips: ఉరుకులు పరుగుల జీవితం.. ఉద్యోగం, సమస్యలు, కుటుంబ బాధ్యత, ఇంకా ఎన్నో విషయాలు మన జీవితంపై ప్రభావం చూపిస్తుంటాయి. దీంతో అందరూ

Health care tips: ఉరుకులు పరుగుల జీవితం.. ఉద్యోగం, సమస్యలు, కుటుంబ బాధ్యత, ఇంకా ఎన్నో విషయాలు మన జీవితంపై ప్రభావం చూపిస్తుంటాయి. దీంతో అందరూ బిజీలైఫ్‌తో బిజీబిజీగా ఉంటాం.. అయితే జీవితంలో ఏదో ఒక సమయంలో బిజీగా ఉండటం కామన్.. కానీ ఎల్లప్పుడూ ఇలానే ఉంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గజిబిజి జీవనశైలి కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో మధుమేహం, థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలన్నీ చిన్నవయసులోనే వస్తున్నాయి. ఇదేకాకుండా ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు
అయితే.. ఎల్లప్పుడూ చురుకుగా ఉండటానికి వర్కౌట్‌లు చేయడం ఉత్తమమని భావిస్తారు. దీనికోసం.. జిమ్‌లో వ్యాయామం చేయడానికి సరైన దినచర్యను అనుసరించడం అవసరం. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది వర్కవుట్‌లకు సమయం దొరకడం లేదు. మీరు యాక్టివ్‌గా ఉండాలంటే.. కొన్ని పద్దతులను, చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఒకే చోట కూర్చోవద్దు ఇంట్లో ఆఫీస్ వర్క్ చేస్తున్నా.. వేరే పనుల్లో బిజీగా ఉన్నా.. మధ్యలో లేచి బ్రేక్ తీసుకోండి. మధ్య మధ్యలో కదలడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. పని సమయంలో మధ్యమధ్యలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండండి. ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల మన శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. మనం ఫిట్‌గా ఉంటాము.
నడవండి మీరు జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయలేకపోతే. ఈ రోజు నుంచే వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల అరగంటలో 200 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మీరు ప్రతిరోజూ జాగింగ్ లేదా జిమ్ కోసం సమయాన్ని కెటాయించకపోతే.. ఖచ్చితంగా 5000 నుండి 10000 మెట్లు ఎక్కడం దిగడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉండటంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఇంటిపని.. బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయాన్ని వెచ్చించండి. మీరే సొంతంగా మీ ఇంటి పనులను, ఇల్లు శుభ్రం చేయడం లాంటివి చేయండి. ఇలా చేయడం వల్ల వ్యాయామం కూడా చేసినట్లు అవుతుంది. ఉడ్చడం, తుడవడం లాంటివి చేస్తే.. ఇదే వ్యాయామం అవుతుంది. ఇది తక్కువ సమయంలో పొట్టను తగ్గించడంలో సహాయపడుతుంది.
పిల్లలతో ఆడుకోండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా వారితో ఆడుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చురుకుగా ఉంటారు. పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. ఇంట్లో పిల్లలు లేకుంటే కాసేపు బయట వారితో వాకింగ్‌కు వెళ్లండి. అంతే కాదు పెంపుడు జంతువులతో ఆడుకోవడం వల్ల కూడా శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయి.
Also Read:




