Corona Health Tips: మీరు కరోనా బారిన పడ్డారా..? ఇలా చేయండి త్వరగా కోలుకుంటారు..!

Corona Health Tips: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలతో తగ్గుముఖం పట్టిందనుకుని..

Corona Health Tips: మీరు కరోనా బారిన పడ్డారా..? ఇలా చేయండి త్వరగా కోలుకుంటారు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 09, 2022 | 6:31 AM

Corona Health Tips: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలతో తగ్గుముఖం పట్టిందనుకుని ఊపిరి పీల్చుకునే సమయంలో కొత్త వేరియంట్‌తో థర్డ్‌వేవ్‌ ముంచుకోస్తోంది. దేశంలో కరోనా పంజావిసురుతోంది. మహమ్మారి రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఒమిక్రాన్‌ రూపంలో వెంటాడుతోంది. ఇక ఒక్కసారి కరోనా బారిన పడితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని 6 దేశాల్లో 24 గంటల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయంటూ ఏ మేరకు వ్యాపిస్తోందో అర్థమైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా కొత్తగా కరోనా సోకినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కరోనా సోకినట్లయితే దాని నుంచి బయట పడేందుకు మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడు ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే భవిష్యత్తులో దీర్ఘకాల కోవిడ్‌ ప్రమాదాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ఎంతో మేలు.

ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి: శరీరాన్ని ఎప్పుడూ హైట్రేటెడ్‌గా ఉంచడం ఎంతో ముఖ్యం. కరోనా నుంచి బయటపడేందుకు ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కోవిడ్‌ వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియన్‌ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. రోజులో అధికంగా నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలని ఇది వరకు ఎంతో మంది వైద్య నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. కానీ కరోనా సమయంలో తప్పకుండా నీరు తాగడం ఎంతో అవసరమంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి బారిన పడినా ముందుగా కోలుకోవాలంటే విశ్రాంతి తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. కరోనా వైరస్‌ బారిన పడిన వారు శరీరానికి ఎక్కువ మొత్తంలో విశ్వాంతి ఇవ్వాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ చిట్కాను విస్మరించడం ద్వారా పోషకాహారం కావాల్సి ఉంటుంది. అందుకు విశ్రాంతి కూడా ఎంతో అవసరమంటున్నారు. విశ్రాంతి తీసుకోవడం వల్ల అనారోగ్యం నుంచి త్వరగా బయటపడవచ్చని సూచిస్తున్నారు.

ఎక్కువ పోషకాలున్న ఆహారం తీసుకోవాలి.. అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. తాజాగా ఉండే పండ్లు, కూరగాయల భోజనం తీసుకోవడం ఉత్తమం. అలాగే వేపుడ్లు, మసాలా ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌, శీతల పానీయాలు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

ప్రతి రోజు వ్యాయమం అలవాటు చేసుకోవాలి.. శరీరం ఆరోగ్యంగా ఉండాలే ప్రతి రోజు వ్యాయమం తప్పనిసరి. యోగా చేయడం, ఇతర వ్యాయమాలు చేయడం శరీరానికి ఎంతో మేలు. ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ బలంగా తయారవుతుందని, కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత సాధారణ వ్యాయమాలతో ప్రారంభించాలని సూచిస్తున్నారు.

మానసిక ఆందోళన.. కరోనా మహమ్మారి మానసికంగా చాలా నష్టపరుస్తుంది. కరోనా బారిన పడిన వారి శరీరం బలహీనపడడమే కాకుండా ఆ వ్యక్తి మానసికంగా కూడా బలహీనంగా మారుతాడు. ఒత్తిడి, ఆందోళన మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఎలాంటి టెన్షన్‌కు గురి కాకుండా ధాన్యం వంటివి అలవర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Stress Monitoring: చెమట ద్వారా ఒత్తిడిని గుర్తించి సమాచారం అందించే సరికొత్త వాచ్‌.. ఇది ఎలా పని చేస్తుంది..?

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికి నిద్రించాలి.. పరిశోధనలలో వెలుగు చూసిన కీలక అంశాలు..!