AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: మళ్ళీ కరోనా, ఓమిక్రాన్ భయపెడుతున్న వేళ.. రోగనిరోధక శక్తిని ఈ స్మూతితో పెంచుకోండి.. తయారీ విధానం

Coronavirus Omicron Scare: మరోసారి కరోనా వైరస్ మన జీవితాల్లోకి వచ్చింది.. కోవిడ్ కు తోడు.. నేనున్నానంటూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా రంగంలోకి దిగింది.. దీంతో దేశ వ్యాప్తంగా మళ్ళీ భారీ..

Omicron: మళ్ళీ కరోనా, ఓమిక్రాన్ భయపెడుతున్న వేళ.. రోగనిరోధక శక్తిని ఈ స్మూతితో పెంచుకోండి.. తయారీ విధానం
Coronavirus Omicron Scare
Surya Kala
|

Updated on: Jan 08, 2022 | 6:43 PM

Share

Coronavirus Omicron Scare: మరోసారి కరోనా వైరస్ మన జీవితాల్లోకి వచ్చింది.. కోవిడ్ కు తోడు.. నేనున్నానంటూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా రంగంలోకి దిగింది.. దీంతో దేశ వ్యాప్తంగా మళ్ళీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ పెద్ద ప్రమాదకారి కాదంటూ కొంచెం ఊరట కలిగించేలా పలునివేదికలు చెబుతున్నాయి. అయితే ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే.. అసలు వ్యాధి రాకుండా తీసుకునే నివారణ చర్యలే ఉత్తమం. కనుక రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేలా పోషకాహారాన్ని తీసుకోండి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచే సహజమైన ఆహార పదార్ధాలు అంటూ పోషకాహార నిపుణులు కొన్ని ఉత్తమ ఆహారపదార్ధాలను తయారు చేసుకోవడం చెబుతున్నారు.  తాజాగా ఉత్తమ రోగనిరోధక శక్తినిచ్చే వంటకం రెసిపీని పోషకాహార నిపుణురాలు షేర్ చేశారు. ఆది మీకోసం

రోగనిరోధక శక్తిని పెంచే షాట్‌ కి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం:  ఈ సులభమైన వంటకాన్ని చేయడానికి కావలిసిన పదార్ధాలు:  3-4 మీడియం పచ్చి పసుపు కొమ్ములుఎం(లేదా కొంచెం పసుపు), 2 మీడియం క్యారెట్లు, 2 అంగుళాల అల్లం తీసుకోండి. ఈ మూడింటిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేయండి.. అవసరం అయితే కొంచెం నీరు పోసుకుని జ్యుస్ తయారు చేసుకోండి. దీనిని 20-30 ml వరకూ రోజూ ఉదయం త్రాగండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు: పసుపు మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  అంతేకాదు యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా కలిగి ఉంది. అంతేకాదు మన ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. పచ్చి పసుపు 300 కంటే ఎక్కువ పోషకాలతో కూడిన శక్తివంతమైన మూలిక. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో   ప్రభావవంతంగా పనిచేస్తుంది. క్యారెట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అల్లంలో మంచి ఔషధ గుణాలున్నాయి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు రాకుండా నివారిస్తుంది.

Also Read: Monkey Love: కోతి పిల్ల మనవరాలిని ముద్దు చేస్తున్న బోనోబో అమ్మమ్మ.. వీటినుంచి ఎంతో నేర్చుకోవాలంటున్న నెటిజన్లు..