Monkey Love: కోతి పిల్ల మనవరాలిని ముద్దు చేస్తున్న బోనోబో అమ్మమ్మ.. వీటినుంచి ఎంతో నేర్చుకోవాలంటున్న నెటిజన్లు..

Monkey Love: అసలు కంటే.. కొసరు ముద్దు అంటూ ఎవరికైనా తమ పిల్లలంటే ఎంత ఇష్టమో.. అంతకంటే ఎక్కువ ఇష్టం ప్రేమ మనవలు, మానవరాళ్ళపై ఉంటుంది. మనుషుల్లానే.. జంతువులు..

Monkey Love: కోతి పిల్ల మనవరాలిని ముద్దు చేస్తున్న బోనోబో అమ్మమ్మ.. వీటినుంచి ఎంతో నేర్చుకోవాలంటున్న నెటిజన్లు..
Grandmother Bonobo Monkey
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2022 | 6:14 PM

Monkey Love: అసలు కంటే.. కొసరు ముద్దు అంటూ ఎవరికైనా తమ పిల్లలంటే ఎంత ఇష్టమో.. అంతకంటే ఎక్కువ ఇష్టం ప్రేమ మనవలు, మానవరాళ్ళపై ఉంటుంది. మనుషుల్లానే.. జంతువులు కూడా తమ పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతాయి. ఈ విషయం అనేకసార్లు.. పలు వీడియోల్లో చూస్తూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు ఓ కోతి.. తన మనవరాలిని కూడా ఎంతో ప్రేమిస్తూ.. లాలిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇటీవల news.com.au తన సోషల్ మీడియా పేజీలో బోనోబో మంకీకి సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో..  ఒక ముసలి ఆడ కోతి తన మనవరాలితో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఈ బోనోబో కోతులు మానవుల పూర్వీకులుగా శాస్త్రజ్ఞులు చెబుతున్న సంగతి తెలిసిందే..

కోతి పిల్లతో ఆడుకుంటున్న ఆడ కోతి ముసలి ఆడ కోతి చిన్న కోతి పిల్లకు తినడానికి ఆహారం అందిస్తోంది. అంతేకాదు.. ఎంతో ముద్దుగా చేస్తూ.. ఈ వృద్ధ కోతి తన మనవరాళ్లతో ఆడుకుంటూ.. కోతి పిల్లకు చక్కిలిగింతలు పెట్టి అది నవ్వుతుంటే.. తాను సంతోష పడుతూ.. అన్ని రకాలుగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ వీడియో చూస్తుంటే నిజంగానే ఈ కోతులు కూడా మనుషుల్లానే తమ ప్రేమని వ్యక్తం చేస్తున్నాయనిపిస్తోంది. మనవరాలు, అమ్మమ్మ ఇద్దరూ చాలా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో కేవలం 45 సెకన్ల మాత్రమే ఉంది..

4 లక్షల మంది లైక్ చేయగా కోట్లాది మంది వీక్షించారు. 14 వేల మందికి పైగా నెటిజన్లు కామెంట్ చేశారు. మనుషుల మాదిరిగానే కోతులు కూడా ఉన్నాయి.. అయినప్పటికీ మనం వాటిని జూలో ఉంచుతామని ఒక వ్యక్తి కామెంట్ చేయగా.. గా ఈ కోతులు చాలా తెలివైనవని మరో వ్యక్తి  వ్యాఖ్యానించాడు.  ఇలాంటి వీడియోలను చూసిన తర్వాత కూడా ప్రజలు జంతువులకు ఎలా హాని చేస్తారంటూ ఒక మహిళ కామెంట్ చేసింది. జంతువుల నుండి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి అంటూ ఇంకొకరు.. ఇలా అనేక మంది కామెంట్ చేశారు.. మొత్తానికి మనవారు, అమ్మమ్మ ఆటలకు ఫిదా అయ్యారు.

Also Read:   వర్మ ఇప్పడు సినిమా ఇండస్ట్రీకి ఆశాకిరణం.. ఆర్జీవీ పెద్దదిక్కుగా మారాడా?…

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్