AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: వర్మ ఇప్పడు సినిమా ఇండస్ట్రీకి ఆశాకిరణం.. ఆర్జీవీ పెద్దదిక్కుగా మారాడా?…

Ram Gopal Varma: సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య  విబేధాలు కొనసాగుతునే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మంత్రి పేర్ని నానికి, సంచలన..

Ram Gopal Varma: వర్మ ఇప్పడు సినిమా ఇండస్ట్రీకి ఆశాకిరణం.. ఆర్జీవీ పెద్దదిక్కుగా మారాడా?...
Ram Gopal Varma Perni Nani
Surya Kala
|

Updated on: Jan 08, 2022 | 5:39 PM

Share

Ram Gopal Varma: సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య  విబేధాలు కొనసాగుతునే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మంత్రి పేర్ని నానికి, సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మధ్య ట్విట్టర్‌ వార్‌ జరుగుతోంది.  సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై ట్విట్టర్ వేదికగా వర్మ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.  టీవీ9 వేదికగా జరిగిన చర్చలో ఆర్జీవీ ప్రశ్నలకు పేర్ని నాని కూడా గట్టిగానే రిప్లై ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ టీవీలలో, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వార్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మీటింగ్ గా మారనుంది. మరో రెండు రోజల్లో ఆర్జీవీ ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో భేటీ కానున్నారు. ఈనెల 10వ తేదీన మంత్రి పేర్ని నానితో భేటీ కాబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ట్వీట్‌ చేశారు. ఈ భేటీలో ప్రధానంగా సినిమా టికెట్ల ధరలపైనే చర్చించనున్నారు.  ఐతే వర్మ ఎలాంటి అంశాలను మంత్రి ముందుంచుతారు..? ఆర్జీవీ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా..? అనేది చాలా ఆసక్తికరంగా మారింది

వర్మ వర్సెస్‌ మంత్రి పేర్ని నాని…

ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో తనిఖీలు చేయడం.. టికెట్ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించడాన్ని రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతూ వస్తున్నారు.  ప్రభుత్వానికి టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం లేదంటూ వర్మ తనదైన శైలిలో వాదన చేస్తున్నారు. ఐతే ఇష్టానుసారం టికెట్ల ధరలను పెంచి సామాన్యుడిపై భారం వేస్తున్నారని.. దానిని మాత్రమే నియంత్రిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. పవన్ సినిమాకు సంపూర్ణేష్ సినిమాకి వ్యత్యాసం తెలియదా అని  రాంగోపాల్ వర్మ ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా మీకు.. మీ డ్రైవర్‌కు కూడా తేడా లేదా? అని సూటిగా ప‌్రశ్నించారు. వర్మకు, మంత్రి పేర్ని నానికి మధ్య ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా మారింది.  100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగిస్తారా..?అంటూ మంత్రి ఎదురు ప్రశ్నిస్తే.. వెంటనే వైసీపీ పాలన నచ్చకుంటే దిగిపోతారా..? అంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే..

వర్మ ఆసక్తికర ట్వీట్ : 

ఇక వరుస ట్వీట్ల వార్ తర్వాత ఆర్జీవీ ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలి అనేది తమ ఉద్దేశం కాదని.. పర్సనల్ గా వైఎస్ జగన్ అంటే తనకు అభిమానమని చెబుతున్నారు రామ్ గోపాల్ వర్మ.  కేవలం సినీ ఇండస్ట్రీ సమస్యలు సరిగా చెప్పుకోలేకపోవడం వల్లో  లేక మీరు మా కోణంలో నుంచి అర్ధం చేసుకోకపోవడం వల్ల మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడిందని.. అంటున్నారు. అంతేకాదు సీఎం కనుక కావడానికి అనుమతిస్తే తాను సినీ ఇండస్ట్రీ తరపున సమస్యల కి సంభందించిన వివరణ ఇస్తానని అంటున్నారు. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాని.. వర్మ ట్వీట్ చేయగా.. స్పందించిన పేర్ని నాని త్వరలోనే కలుద్దామంటూ రిప్లై అచ్చారు. తాజాగా ఈనెల 10వ తేదీన కలవాలని సూచించారు.

టికెట్‌ ధరల నిర్ణయంపై మొదట్లో పవన్‌ కళ్యాణ్‌, తరువాత హీరో నాని స్పందించారు. మంత్రి పేర్ని నానితో అక్టోబర్‌ 29న కొంతమంది నిర్మాతలు సమావేశం జరిపారు.  తరువాత కొంతమంది థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు డిసెంబర్‌ 28న సమావేశమయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాలేదు, ప్రభుత్వం తాము ఇచ్చిన జీవో 35కే కట్టుబడి వుంది. కాకపోతే కోర్టు ఆదేశానుసారం సమస్య పరిష్కారానికి ఒక కమిటీని మాత్రం నియమించారు.

వర్మే పెద్దదిక్కుగా మారాడా…? ఇప్పటి వరకూ టాలీవుడ్‌ నుంచి నిర్మాతలు .. ఇతర హీరోలు కలుస్తామన్నా.. ఏపీ ప్రభుత్వం పెద్దలకు ఎవరూ  అపాయింట్‌మెంట్లు ఇవ్వలేదు.  అయితే ఆర్జీవీకి మాత్రం వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేం దర్శకుడు అజయ్ భూపతి… ‘మా బాస్ రామ్‌గోపాల్ వర్మని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక. ఇటీవల ట్విట్ చేశాడు. అయితే ఇప్పుడు అనుకోకుండా ఇండస్ట్రీ తరపున ప్రభుత్వంతో చర్చలకు వర్మే వెళ్లే పరిస్థితి వచ్చింది.

ఇండస్ట్రీకి ఆశాకిరణం

అసలు పరిశ్రమకు సంబంధించిన ఎవరినీ సంప్రదించకుండా వర్మ-మంత్రి భేటీ ఎలా నిర్ణయమయింది? అనేకమంది విమర్శలకు కౌంటర్లతో సరిపెట్టిన వైసీపీ ప్రభుత్వం వర్మకు పెద్దపీట ఎందుకు వేసింది? బ్లూఫిల్ములు చూసే, బూతు సిన్మాలు తీసే వ్యక్తిగా, వివాదాస్పదుడిగా ముద్రపడ్డ వర్మతో.. సినిమా పెద్దలెవరైనా చర్చల విషయం మాట్లాడారా? చర్చలకు వెళ్లే ముందు ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఇతర పెద్దలతో వర్మ చర్చిస్తాడా?  అసలు వర్మ రాయబారం ఎంతవరకూ ఫలిస్తుంది? పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకులు చేయలేని పని వర్మ సాధించగలడా? ఇన్ని ప్రశ్నల మధ్య.. వైసీపీ ప్రభుత్వం మనసు మార్చగలిగితే వర్మ ఇమేజ్‌ అమాంతం పెరిగిపోతుంది. వివాదాలతో అంటరానివాడై, బూతులు తిట్టించుకున్న వర్మే ఇప్పడు సినిమా ఇండస్ట్రీకి ఆశాకిరణం అవ్వటం విశేషం

ఆర్జీవీతో వాదన

ఆర్జీవీతో వాదన అంత తేలిక కాదు. ఈ విషయం పేర్ని నానికి ట్వీట్ల సమయంలోనే తెలిసిపోయి ఉంటుంది. ఇంతకుముందు లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్ర విడుదల విషయంలో 2019 ఏప్రిల్‌లో టీడీపీ ప్రభుత్వంతో తలపడ్డ వర్మ అయితే జగన్ విషయంలో ఆర్జీవీ చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తనకు జగన్‌ అంటే అభిమానం అని కూడా  చెప్పారు. జగన్‌కేమీ తెలియదని ఆయన చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ఉన్నారని.. వారే తప్పుదోవ పట్టిస్తున్నారని కామెంట్‌ చేశారు. ఈ పరిణామాల కారణంగా ఆర్జీవీ – పేర్ని నాని భేటీ హైలెట్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి.. సంప్రదాయం దుస్తుల్లో.. ప్రభల ఊరేగింపులో స్టూడెంట్స్…

  ‘రేపో, ఎల్లుండో చచ్చిపోతా.. తగలబెట్టేస్తారు అనుకున్నా’.. రాజశేఖర్’ సంచలన కామెంట్స్