AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కరోనా కాలంలో ప్రతీ ఉదయం ఇది తీసుకోండి.. రోగనిరోధక శక్తికి ఢోకా ఉండదు..!

కరోనా ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో మరోసారి రోగనిరోధక శక్తిపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే, లవంగాలు మీకు సహాయం చేసే లిస్టులో కీలకంగా కానున్నాయి.

Health Tips: కరోనా కాలంలో ప్రతీ ఉదయం ఇది తీసుకోండి.. రోగనిరోధక శక్తికి ఢోకా ఉండదు..!
Cloves
Venkata Chari
|

Updated on: Jan 10, 2022 | 2:15 PM

Share

Health Tips: కోవిడ్-19 మరోసారి దేశంలో తన హస్తాన్ని విస్తరించింది. కరోనా ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవాలనుకుంటే అందులో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉండేందుకు లవంగం పనిచేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు, అనేక వ్యాధుల నుంచి బయటపడతారు. లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పడు చూద్దాం..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది – లవంగాలలో విటమిన్ సి, కొన్ని యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచుతాయి. ఇది మీ శరీరం ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. అయితే లవంగాలను కరోనా కాలంలో ప్రతిరోజూ తినాలి. ఇలా చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ బారిన పడరకుండా ఉండే వీలుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది- ఉదయం పూట లవంగాలను తీసుకోవడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలనైనా నయం చేయడంలో మీకు సహాయపడుతుంది. లవంగం జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ రుగ్మతలను నివారిస్తుంది. లవంగాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది.

కాలేయ పనితీరును ప్రోత్సహిస్తుంది – మీ కాలేయం శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అందువల్ల, మీ కాలేయాన్ని మెరుగుపరచడానికి, మీరు ప్రతిరోజూ లవంగాలను తినవచ్చు. లవంగం కాలేయాన్ని మెరుగుపరుస్తుంది.

ఎముకలకు మంచిది – లవంగాలలో ఫ్లేవనాయిడ్లు, మాంగనీస్, యూజీనాల్ ఉన్నాయి. ఇవి ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి, లవంగాల వినియోగం ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

Also Read: Covid Third Wave: దేశంలో థర్డ్ వేవ్ ముగిసేది ఎప్పుడంటే..? IIT కాన్పూర్ ప్రొఫసర్ అంచనా ఇది..

TS Corona Virus: ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కల్లోలం.. 11 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్..