TS Corona Virus: ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కల్లోలం.. 11 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్..

TS Corona Virus: రెండేళ్ల నుంచి ఫస్ట్, వేవ్ అంటూ రకరకాల రూపాలతో ఈ మహమ్మారి మానవులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. నిన్నా మొన్నటి వరకూ కరోనా వైరస్ తగ్గినట్లు తగ్గి..

TS Corona Virus: ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కల్లోలం.. 11 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్..
Osmania Hospital
Follow us
Surya Kala

|

Updated on: Jan 10, 2022 | 12:37 PM

TS Corona Virus: రెండేళ్ల నుంచి ఫస్ట్, వేవ్ అంటూ రకరకాల రూపాలతో ఈ మహమ్మారి మానవులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. నిన్నా మొన్నటి వరకూ కరోనా వైరస్ తగ్గినట్లు తగ్గి.. మళ్లీ విజృంభిస్తోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణాలో కూడా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు.. కరోనా బాధితులకు చికిత్సనందిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా బాధితులుగా మారుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.

ఉస్మానియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 11మంది హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు నిర్వహిచుకున్నారు. వీరిలో 11 మంది హౌస్ సర్జన్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరిని చికిత్స నిమిత్తం ఐసోలేషన్ కు తరలించారు.

తెలంగాణాలో గత 24 గంటల్లో 1,673 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ కేసుల్లో భారీగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదనవే అని వైద్య అధికారులు చెప్పారు. రోజు రోజుకీ భారీగా కేసులు నమోదవుతుండంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిబంధనలను మరింత కఠిన తరం చేసింది.

Also Read:   తమకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసిన తాలిబన్లు.. మీడియాకు కొత్త నిబంధనలు..