Talibans: తమకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసిన తాలిబన్లు.. మీడియాకు కొత్త నిబంధనలు..
Talibans: ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకుని పాలిస్తున్న తాలిబన్లు తమదైన శైలిలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మహిళలపై పలు ఆంక్షలను విధించిన తాలిబన్లు.. తాజాగా విద్యావంతులను..
Talibans: ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకుని పాలిస్తున్న తాలిబన్లు తమదైన శైలిలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మహిళలపై పలు ఆంక్షలను విధించిన తాలిబన్లు.. తాజాగా విద్యావంతులను టార్గెట్ చేస్తోంది. శనివారం కాబూల్ యూనివర్సిటీలో లా అండ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఫైజుల్లా జలాల్‌ను అరెస్టు చేశారు. తన తండ్రిని అరెస్టు చేసిన విషయం జలాల్ కుమార్తె హసీనా జలాల్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తన తండ్రిని అరెస్టు చేసి ఆరు గంటలకు పైగా గడిచిందని.. తన తండ్రి గురించి తనకు ఏ విధమైన సమాచారం లేదని.. వెంటనే తన తండ్రి జలాల్ ను రిలీజ్ చేయాలని హసీనా డిమాండ్ చేసింది.
హసీనా జలాల్ ట్వీట్ లో తండ్రి అరెస్ట్ గురించి ప్రస్తావిస్తూ.. ఆ ట్విట్ ను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, హ్యూమన్ రైట్స్ వాచ్ , UN ఆఫ్ఘనిస్తాన్‌లకు ట్యాగ్ చేసింది. తన తండ్రిని తాలిబన్లు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నట్లు హసీనా తెలిపింది.
జలాల్ అరెస్టును తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ధృవీకరించారు. అంతేకాదు జలాల్ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను హింస చేసే దిశగా ప్రేరేపిస్తున్నాడని చెప్పారు.
అయితే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సౌత్ ఏషియా జలాల్ అరెస్టును ఖండించింది. వెంటనే జలాల్ ను రిలీజ్ చేయాలనీ కోరింది. “టీవీ షోలో తన భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకుని, తాలిబాన్లను విమర్శించిన కాబూల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫైజుల్లా జలాల్ అరెస్టును ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండిస్తోంది” అని పేర్కొంది. అతడిని బేషరతుగా విడుదల చేయాలని తాము తాలిబాన్ అధికారులను కోరుతున్నామని తెలిపింది. #FrijLal’ పేరుతో ప్రభుత్వ సంస్థలను విమర్శించినందుకు జలాల్‌ను అరెస్టు చేసినట్లు కాబూల్‌కు చెందిన టోలో న్యూస్‌కి భద్రతా వర్గాలు తెలిపాయి.
చర్చలో తాలిబాన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న మూడు నెలల తర్వాత.. జలాల్ టోలో న్యూస్ (ఆఫ్ఘనిస్తాన్ మీడియా)లో ప్రత్యక్ష చర్చలో పాల్గొని.. తాలిబాన్ పాలనను ధైర్యంగా విమర్శించారు. జలాల్ చేసిన వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల మద్దతు లభించింది. ఆప్ఘనిస్తాన్ లోని ప్రజలు ఇప్పుడు తమ భద్రత గురించి భయపడుతున్నారు.
అయితే జలాల్ పాల్గొన్న చర్య జరిగిన కొన్ని గంటల తర్వాత.. మీడియా కోసం కొత్త నిబంధనలను తీసుకొస్తామని తాలిబాన్ ప్రకటించింది. జలాల్ , అతని కుటుంబం సంవత్సరాలుగా అనేక దాడుల నుండి బయటపడింది. 2019లో ఆయన ఇంటిపై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు.
Also Read: