Hyderabad: పాపం కాలు విరిగింది కట్టు వేస్తున్నారు అనుకునేరు.. అసలు విషయం తెలిసి అధికారులే షాక్
ఫోటో చూడగానే పాపం దెబ్బతగిలిందని జాలి పడేరు. అసలు విషయం తెలిస్తే.. నోరెళ్లబెడతారు.
యూఏఈ నుంచి ఫ్లైట్ వచ్చిదంటే.. కస్టమ్స్ ఆఫీసర్స్‌కు చేతినిండా పనే. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయితే మరీనూ. తాజాగా 09.01.22న షార్జా నుండి G9-450 ఫ్లైట్‌లో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.47.55 లక్షలు విలువ చేసే 970 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అయితే ఇక్కడ బంగారం స్మగ్లింగ్ చేసిన వ్యక్తి అమాయకుడిలా ఉన్నాడు. కడుపులో దాచుకుని వచ్చినా.. గోల్డ్ ని కక్కిస్తారు మన కస్టమ్స్ ఆఫీసర్స్. అలాంటిది కాళ్లకు దెబ్బతగిలినట్టుగా నటిస్తూ.. కట్లు కట్టాడు సదరు ప్రయాణికుడు. ఆ బ్యాండేజీల్లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేయాలని చూశాడు. కాని కస్టమ్స్ అధికారుల స్కానింగ్‌లో ఈ ప్యూర్ గోల్డ్ దొరికిపోయింది. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ చేస్తున్నారు అధికారులు.
On 09.01.22 Hyderabad Customs booked a case for smuggling of gold against a male pax arriving by Flight G9-450 from Sharjah.970 grams of gold valued at Rs. 47.55 lakhs recovered & seized. Gold in paste form was concealed inside the bandages tied to calves of both the legs. pic.twitter.com/zdrPGTgudJ
— Hyderabad Customs (@hydcus) January 10, 2022
ఇండియా మార్కెట్‌లో గోల్డ్ ధర పెరగడంతో పాటు ఇంపోర్ట్ ట్యాక్స్ పైకి, రూపాయి విలువ కిందికి చేరడమే ఈ స్మగ్లర్లకు కలిసి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలా చూసినా కేజీ గోల్డ్ అక్రమ రవాణా చేస్తే కనిష్టంగా రూ.3లక్షల నుంచి రూ.4లక్షల లాభం ఉంటోందని అంచనా వేస్తున్నారు. అందుకే బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు రోజుకో కొత్త ఉపాయాన్ని కనుగొంటున్నారు స్మగ్లర్స్. కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95శాతం ప్రొఫైలింగ్ పద్ధతినే ఫాలో అవుతున్నారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, ఫారెన్ లో ఉన్న సమయం తదితర పరిగణలోకి తీసుకొని అనుమానితుల్ని గుర్తిస్తారు.
Also Read: ఆర్టీసీ బస్సుల్లో మాస్కు తప్పనిసరి… లేకుంటే ఫైన్ కట్టాల్సిందే…