AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana covid 19 Curbs: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఈనెల 20 వరకు ఆంక్షలు కఠినతరం!

దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Telangana covid 19 Curbs: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఈనెల 20 వరకు ఆంక్షలు కఠినతరం!
Cm Kcr
Balaraju Goud
|

Updated on: Jan 10, 2022 | 9:34 AM

Share

Telangana covid 19 Curbs Extended: దేశంలో కోవిడ్ విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జీవో నెం 6 తీసుకువచ్చింది, తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంక్షలు కఠినతరం చేసింది. రాష్ట్రంలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌ నిర్వహించకూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా , వ్యాపార సంస్థల్లో ప్రతి ఒక్కరు తప్పని సరి మాస్కు ధరించాలి. ఈమేరకు ఆదివారం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కు ధరించకుంటే రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై సర్కార్ నిషేధం విధించింది.

ఈ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల చదువుల సంబరం ఎంతో కాలం నిలిచేలా లేదు. థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చిందంటూ వైద్య శాఖ చెబుతుండటంతో ముందుగానే విద్యాలయాలకు సంక్రాంతి సెలవులతో సర్దేసింది సర్కారు. ఇంతవరకు బానే ఉన్నా ఈ నెల 16తో సంక్రాంతి హాలీడేస్ ముగుస్తాయి. ఆ తర్వాత పరిస్థితే గందరగోళంగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా మళ్లీ బడులు తెరుచుకునే పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఈ నెలాఖరులో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని హెల్త్ డిపార్ట్ మెంట్ చెబుతుంటే.. స్కూళ్లు ఓపెన్ చేసే పరిస్థితే ఉండదని నిపుణులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల11 నుంచి బడులకు, 13 నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా… 8 నుంచే విద్యాసంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

సెలవుల తర్వాత ఫిజికల్ క్లాసులకు సర్కార్ అనుమతిచ్చేది డౌటేనని ఆఫీసర్లే చెబుతున్నారు. దీంతో విద్యాసంవత్సరం వేస్ట్ కాకుండా స్టూడెంట్లకు పాఠాలు చెప్పేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ ఆన్​లైన్, టీవీ పాఠాలను స్టూడెంట్లకు అందించేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో 2020–21అకాడమిక్ ఇయర్ లో కేవలం నెల రోజులే ఫిజికల్ క్లాసులు నడవగా, మిగిలిన క్లాసులన్నీ ఆన్​లైన్​లోనే జరిగాయి. దీంతో విద్యావ్యవస్థ గాడీ తప్పింది. 2021–22 అకడమిక్ ఇయర్ లో జులైలో ఆన్​లైన్, టీవీ పాఠాలు మొదలు కాగా కేసులు తగ్గడంతో సెప్టెంబర్ నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే విద్యావ్యవస్థ గాడిన పడుతుందనే టైమ్ లో మళ్లీ కేసులు ఎక్కువయ్యాయి. దీంతో మళ్లీ బడులు బంద్ అయ్యే పరిస్థితి రావడంతో స్టూడెంట్లు, పేరెంట్స్​లో అయోమయం నెలకొంది.

ఇదిలావుంటే, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 48,583 కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. కొత్తగా 1,673 పాజిటివ్‌ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 6,94,030కి చేరాయి.

Read Also….  కరోనా కట్టడికి ఏపీ సర్కార్ మరో ముందడుగు.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్‌

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా