కరోనా కట్టడికి ఏపీ సర్కార్ మరో ముందడుగు.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్‌

కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది ఏపీ సర్కార్‌. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సీజన్‌ ప్లాంట్లను ప్రారంభిస్తారు సీఎం జగన్‌.

కరోనా కట్టడికి ఏపీ సర్కార్ మరో ముందడుగు.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్‌
Cm Jagan
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 10, 2022 | 9:17 AM

AP CM YS Jagan inaugurates Oxygen Plants: కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది ఏపీ సర్కార్‌. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సీజన్‌ ప్లాంట్లను ప్రారంభిస్తారు సీఎం జగన్‌. 426 కోట్ల రూపాయలతో 144 ఆక్సీజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దీన్ని ఇవాళ వర్చువల్‌గా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు .

రెండో వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరతను దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి జగన్‌, మెడికల్‌ ఆక్సిజన్‌ విషయంలో స్వావలంబన సాధించే దిశగా పలు కీలక చర్యలను తీసుకున్నారు. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి ఇవాళ వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఒమైక్రాన్‌ ప్రభావంతో కేసులు వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లు కోవిడ్‌ మహమ్మారిన బారినపడ్డ వారికి చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

గడచిన రెండేళ్లుగా మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆస్పత్రుల ఆవరణలోనే ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్షన్‌ పద్ధతిలో తయారైన ఆక్సిజన్‌, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరుతుంది. అలాగే సిలిండర్లను కూడా ఈ ఆక్సిజన్‌తో నింపే వీలుంది.

Read Also… kidney transplant: గొప్ప వైద్యుడు.. తొలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతం చేసిన డా. జోసెఫ్‌ ముర్రే..(వీడియో)