kidney transplant: గొప్ప వైద్యుడు.. తొలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతం చేసిన డా. జోసెఫ్‌ ముర్రే..(వీడియో)

kidney transplant: గొప్ప వైద్యుడు.. తొలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతం చేసిన డా. జోసెఫ్‌ ముర్రే..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 10, 2022 | 9:07 AM

ప్రపంచంలో తొలి మూత్రపిండం మార్పిడి జరిగి ఈ రోజుకి 67 ఏళ్ళు పూర్తయ్యాయి. బోస్టన్‌లోని పీటర్‌ బెంట్‌ హాస్పిటల్‌లో 1954 లో డాక్టర్‌ జోసెఫ్‌ ముర్రే విజయవంతంగా మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేశారు.


ప్రపంచంలో తొలి మూత్రపిండం మార్పిడి జరిగి ఈ రోజుకి 67 ఏళ్ళు పూర్తయ్యాయి. బోస్టన్‌లోని పీటర్‌ బెంట్‌ హాస్పిటల్‌లో 1954 లో డాక్టర్‌ జోసెఫ్‌ ముర్రే విజయవంతంగా మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఈ శస్త్రచికిత్స జరిగిన రోగి దాదాపు 8 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించాడు. రోగి కవల సోదరుడే మూత్రపిండం ఇవ్వగా.. మార్పిడి సర్జరీని డాక్టర్‌ ముర్రే నిర్వహించి విప్లవాత్మక మార్పుకు బీజం వేశారు. ఆ తర్వాత డాక్టర్‌కు 1990 లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.అవయవ మార్పిడి ఆలోచన కొత్తదేమీ కాదు. 1900 తర్వాత చాలా సార్లు కిడ్నీ మార్పిడికి ప్రయత్నించారు. మానవ శరీరంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఒక కిడ్నీ తీసేసినప్పటికీ వ్యక్తి జీవించగలడు. అంతర్గత అవయవ మార్పిడి మాత్రం జరగలేదు.1954 డిసెంబర్ 23 న కిడ్నీ మార్పిడిలో పెద్ద పురోగతిని సాధించారు. రిచర్డ్ హారిక్ అనే యువకుడు కిడ్నీ వ్యాధితో బాధపడ్డాడు. బోస్టన్‌లోని వైద్యులను సంప్రదించాడు. చివరకు హారిక్‌కు ఆయన కవల సోదరుడు రోనాల్డ్ కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించారు. దాదాపు 5 గంటలపాటు డాక్టర్ జోసెఫ్ ముర్రే బృందం కిడ్నీ మార్పిడి సర్జరీని విజయవంతంగా పూర్తిచేసింది.

Published on: Jan 10, 2022 09:04 AM