AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన భరించలేరు.. ఆ సమయంలో సింపుల్‌గా ఇలా చేయండి..

Mouth Smell Tips: చాలామంది పచ్చి ఉల్లిపాయ తినడం అంటే బాగా ఇష్టపడుతారు. కానీ అది తిన్న తర్వాత నోటి నుంచి వచ్చే దుర్వాసన భరించడం చాలా కష్టం.

పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన భరించలేరు.. ఆ సమయంలో సింపుల్‌గా ఇలా చేయండి..
Eating Onion
uppula Raju
|

Updated on: Jan 11, 2022 | 3:15 PM

Share

Mouth Smell Tips: చాలామంది పచ్చి ఉల్లిపాయ తినడం అంటే బాగా ఇష్టపడుతారు. కానీ అది తిన్న తర్వాత నోటి నుంచి వచ్చే దుర్వాసన భరించడం చాలా కష్టం. ఈ భయంతో ఉల్లిపాయని అవైడ్‌ చేస్తారు. అయితే ఆహారంలో ఉల్లిపాయ చాలా ముఖ్యమైనది. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దలు చెబుతారు. దీనిని ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. అయితే పచ్చి ఉల్లిపాయ తిన్న తర్వాత దుర్వాసన పోవాలంటే సింపుల్‌గా ఈ చిట్కాలు పాటించండి. అవేంటో తెలుసుకుందాం.

1. తాజా పండ్లు: పచ్చి ఉల్లిపాయను తిన్న తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ పరిస్థితిలో ప్రజలు తరచుగా ఇబ్బంది పడుతారు. దీని నుంచి బయటపడాలంటే తాజా పండ్లను తినాలి. నివేదికల ప్రకారం తాజా పండ్లు నోటిలో ఉండే సల్ఫర్ వాసనని తగ్గిస్తుంది.

2. పచ్చి కొత్తిమీర: నోటి దుర్వాసనను తొలగించడంలో కొత్తిమీర ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది తింటే నోటి దుర్వాసన పోతుంది అంతేకాక ఫ్రెష్ గా ఉంటుంది. మీరు పచ్చి కొత్తిమీర తినాలనుకుంటే దాని ఆకులను కొన్ని తీసుకుని వాటిని కడిగి కాసేపు నోట్లో వేసుకొని నమలండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే తాజాగా ఉంటుంది.

3. పుదీనా: ఇది ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పచ్చి ఉల్లిపాయ వాసనను తొలగించడానికి ఆహారం తిన్న తర్వాత పుదీనా నీటిని తయారు చేసి తాగాలి. ఇందులో మీరు సోపు గింజలను కూడా కలుపుకోవచ్చు.

4. యాపిల్ సైడర్ వెనిగర్: ఆరోగ్యానికి మంచిదని భావించే యాపిల్ సైడర్ వెనిగర్ నోటి దుర్వాసనను పోగొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ తిన్న తర్వాత నోటిలోని దుర్వాసనను తొలగించడానికి దీన్ని ఉపయోగించడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో వేసి తాగాలి. మీకు కావాలంటే నోరు కూడా శుభ్రం చేసుకోవచ్చు.

5. యాలకులు: నోటి దుర్వాసన పోవాలంటే యాలకులు బెస్ట్‌. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. యాలకులు నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. అయితే మీరు యాలకులను నీటిలో వేసి తాగితే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

IND vs SA, 3rd Test, Day 1, LIVE Score: సిరీస్‌ డిసైడర్ టెస్ట్‌లో విజయం ఎవరిదో.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్

సంక్రాంతి స్పెషల్‌.. నువ్వులు, బెల్లం లడ్డూలు.. చలికాలంలో ఆరోగ్యానికి చాలా మేలు

మీరు ఈ విషయాలలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి తప్పించుకోవచ్చు..! కానీ ఇవి చాలామందికి తెలియదు..