IARI Recruitment: నిరుద్యోగులకు గమనిక.. పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ పోస్టులు.. గడువు తేదీ పొడగింపు..
IARI Recruitment: ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టెక్నీషియన్ పోస్టుల కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీని పొడగించింది. దీనికి
IARI Recruitment: ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టెక్నీషియన్ పోస్టుల కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీని పొడగించింది. దీనికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకరాం.. ICAR టెక్నీషియన్ పోస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు 20 జనవరి 2022 వరకు కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iari.res.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 641 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అన్‌రిజర్వ్‌డ్ (286), ఓబీసీ (133), ఈడబ్ల్యూఎస్ (61), ఎస్సీ (93), ఎస్టీ (68) పోస్టులు ఉన్నాయి.
* టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700(బేసిక్)+అలవెన్సులు అందిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 10-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
దరఖాస్తు రుసుము ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, జనరల్, EWS, OBC అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 1000 డిపాజిట్ చేయాలి. ఇది కాకుండా SC, ST కేటగిరీకి చెందిన అభ్యర్థులు 300 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దీన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు.