TTD Recruitment: తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కు పైగా జీతం..

TTD Recruitment: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి (టీటీడీ) చెందిన శ్రీ ప‌ద్మావ‌తి చిల్డ్ర‌న్ హార్ట్ సెంట‌ర్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. తిరుప‌తిలో ఉన్న ఈ సంస్థ‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

TTD Recruitment: తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కు పైగా జీతం..
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 11, 2022 | 10:19 AM

TTD Recruitment: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి (టీటీడీ) చెందిన శ్రీ ప‌ద్మావ‌తి చిల్డ్ర‌న్ హార్ట్ సెంట‌ర్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. తిరుప‌తిలో ఉన్న ఈ సంస్థ‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివ‌రాలు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 08 ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో పీడియాట్రిక్‌ అసోసియేట్‌ థొరాసిక్‌ సర్జన్ (01), పీడియాట్రిక్‌ అసిస్టెంట్‌ సిటీ సర్జన్ (01), అసిస్టెంట్‌ పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్ (02), రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్ (01), అసిస్టెంట్‌ అనెస్థెటిస్ట్ (02), అసిస్టెంట్‌ పీడియాట్రీషియన్ (01) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల‌ను అనుసరించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌ను డైరెక్ట‌ర్, శ్రీ ప‌ద్మావ‌తి చిల్డ్ర‌న్స్ హార్ట్ సెంట‌ర్‌, తిరుపతి 517507 అడ్ర‌స్‌కు పంపించాలి.

* ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా నెల‌కు రూ. 61450 నుంచి రూ.209200 వరకు చెల్లిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా 20-01-2022ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Best Power Banks: ప‌వ‌ర్ బ్యాంక్ కొనాల‌ని ప్లాన్ చేస్తున్నారా.? అయితే బెస్ట్ ఫీచర్స్‌తో కూడిన వీటిపై ఓ లుక్కేయండి..

Viral Video: ఆపదలో పప్పి !! చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా ?? వీడియో

Fixed Deposit: డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ముందుగా తెలుసుకోండి.. ఆ తర్వాతే డిపాజిట్ చేయండి..