AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Tips: చలికాలంలో బద్దకం వీడి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పక పాటించాల్సిందే..

Health Tips: చలికాలంలో బద్ధకంగా అనిపించడం సహజం. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో ఉదయాన్నే నిద్ర లేవడానికి చాలా మంది బద్దకిస్తుంటారు.

Winter Tips: చలికాలంలో బద్దకం వీడి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పక పాటించాల్సిందే..
Shiva Prajapati
|

Updated on: Jan 12, 2022 | 8:27 PM

Share

Health Tips: చలికాలంలో బద్ధకంగా అనిపించడం సహజం. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో ఉదయాన్నే నిద్ర లేవడానికి చాలా మంది బద్దకిస్తుంటారు. ఫలితంగా బారెడు పొద్దెక్కినా దుప్పటి ముసుగు మాత్రం తీయరు. అది కాస్తా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే.. చలి కారణంగా ఉదయాన్నే నిద్రలేవకపోవడంతో చాలామంది రోజూ చేసే వర్కౌట్స్ మిస్ అవుతుంటారు. అలా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటారు. అయితే, చలికాలంలో బద్ధకాన్ని పొగొట్టుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వ్యాయామం కీలకం..  ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. యోగా లేదా ఇతర శారీరక శ్రమ మీ శరీరంలో వేడిని పెంచుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితే.. ఫ్లూ, జలుబు వంటి కాలానుగుణ వ్యాధుల నుండి బయటపడొచ్చు.

హెల్తీ ఫుడ్.. రోగనిరోధక శక్తిని పెంచడానికి తృణధాన్యాలు, చేపలు, చిక్కుళ్ళు, గింజలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, తాజా పండ్లు, కూరగాయలు తినాలి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినాలి.

ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి.. ఒత్తిడికి గురైనట్లుగా అనిపిస్తే కాస్త విశ్రాంతి తీసుకోండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచే పనులు చేయండి.  ఇది మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

సూర్యరశ్మి.. చలికాలంలో కొంత సమయం ఎండలో ఉండటం ఉత్తమం. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల విటమిన్ డి లభిస్తుంది. దీంతో అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.

బీపీ, హార్ట్ రేట్, షుగర్ లెవల్స్ పర్యవేక్షించాలి..  చలికాలంలో రక్తపోటు, హృదయ స్పందన రేటు, రక్తంలో చక్కెర స్థాయిని పర్యవేక్షించడం అవసరం. ఏవైనా తేడాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ధూమపానం చేయొద్దు.. ధూమపానం, మద్యపానం ఎక్కువగా చేస్తున్నట్లయితే.. వెంటనే ఆపేయడం ఉత్తమం. చలికాలంలో ఆల్కహాల్ గుండె కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ధూమపానం గుండె సమస్యలను, శ్వాసకోశ వ్యాధులను తీవ్రతరం చేస్తుంది. ఇది అధిక రక్తపోటుకు కారణమవుతుంది.

సరిపడ నిద్ర.. నిద్రపోవడం చాలా ముఖ్యం. సరిపడా సమయం నిద్రపోవడం వలన రోజంతా చురుకుదనంతో ఉంటారు. అధ్యయనాల ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి.

వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరించాలి.. శీతాకాలంలో, ప్రజలు సగం సగం ఉన్న బట్టలు ధరించి బయటకు వెళ్లకూడదు. అల్పోష్ణస్థితిని నివారించడానికి శీతాకాలపు ప్రత్యేక దుస్తులను ధరించడం చాలా ముఖ్యం. కోటు, టోపీ, హ్యాండ్ గ్లౌజ్‌లు, సాక్స్ ధరించడం ద్వారా శరీరం వెచ్చగా ఉంటుంది.

తరచుగా చేతులు కడుక్కోండి.. శ్వాసకోశ ఇన్ఫెక్షన్.. గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది. సబ్బు, నీటితో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. జ్వరం, వైరల్ దగ్గు, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలతో పాటు ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

Also read:

ICC Women World Cup 2022: ప్రపంచ కప్‌ జట్టులో ఆ కీలక ప్లేయర్లకు హ్యాండిచ్చిన సెలక్టర్లు.. కారణం ఏంటంటే?

First Sunrise of 2022: అంతరిక్షంలో సూర్యోదయం.. వావ్ అంటోన్న నెటిజన్లు.. మీరూ ఓ లెక్కేయండి..!

Touching Video: చిరకాల స్నేహితుడికి.. నెమలి తుది వీడ్కోలు.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్

పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు