Touching Video: చిరకాల స్నేహితుడికి.. నెమలి తుది వీడ్కోలు.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్

Heart Touching Video:ప్రేమ, స్నేహం, విశ్వాసం భావోద్వేగాలను ప్రదర్శించడంలో తాము మనుషుల కంటే ఏ మాత్రం తక్కువ కాదంటూ కుక్క, పిల్లి. ఏనుగువంటి జంతువులు పలు సందర్భాల్లో..

Touching Video: చిరకాల స్నేహితుడికి.. నెమలి తుది వీడ్కోలు.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్
Touching Video Of Peacock L
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2022 | 1:20 PM

Heart Touching Video:ప్రేమ, స్నేహం, విశ్వాసం భావోద్వేగాలను ప్రదర్శించడంలో తాము మనుషుల కంటే ఏ మాత్రం తక్కువ కాదంటూ కుక్క, పిల్లి. ఏనుగువంటి జంతువులు పలు సందర్భాల్లో తెలియజేశాయి. తాజాగా ఓ నెమలి.. తన చిరకాల స్నేహితుడికి వీడ్కోలు పలికిన విధానం.. మనసుకు హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజస్థాన్‌లోని కుచెరా టౌన్‌కు చెందిన రామ్ స్వరూప్ బిష్ణోయ్ జంతు ప్రేమికుడు. గత కొన్ని సంవత్సరాలుగా రెండు మూడు నెమళ్లు రోజూ రామ్ ఇంటికి వస్తున్నాయి. వాటికీ రోజు ప్రేమగా తినడానికి గింజలు వేస్తున్నాడు. దీంతో రామ్ స్వరూప్ కి నెమళ్ళు కుటుంబ సభ్యుల్లా కలిసిపోయాయి. అయితే కాలక్రమంలో ఒక నెమలి వృద్ధాప్యంతో మరణించింది. నెమలి మృతితో మరొక నెమలి కన్నీరు పెట్టింది. నెమలి మృత దేహాన్ని పూడ్చడానికి ఇద్దరు యువకులకు చెప్పాడు.  నెమలి దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని తీసుకువెళుతున్నప్పుడు .. ఒక నెమలి కన్నీరు పెడుతూ వారిని వెంబడించింది. నెమలి మృత దేహాన్ని ఖననం చేసేదాకా ఆ నెమలి అక్కడే ఉంది.

భారత  ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాం తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియో పోస్ట్‌ చేశారు.  నెమలి తన సహచర నెమలిని విడిచి ఉండలేకపోతోంది. హృదయాన్ని కదిలించే వీడియో.. అంటూ ఓ కామెంట్ జత చేశారు. హృదయాలను కదిలిస్తున్న ఈ వీడియో లక్షలాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ 1.26 లక్షల మంది వీక్షించారు. మనుషుల కంటే పక్షులు, పశువులకే ప్రేమ అధికంగా ఉంటుంది.. నెమలి ఎంత బాధ అనుభవిస్తోందో.. పక్షి ప్రేమికులకు తెలుస్తుంది… ప్రేమ స్నేహం, బంధం , అనుబంధః విలువ నేటి జనరేషన్ కు ఈ నెమలి  చెబుతుంది… హార్ట్‌ టచింగ్‌ వీడియో అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  కెమికల్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్.. ఆరుగురు మృతి.. 25 మందికి తీవ్ర అస్వస్థత

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు