Groom Viral Video: రణ్‌బీర్ పాటకు స్టెప్పులేసిన వరుడు.. పెళ్లి కూతురు రియాక్షన్ చూసి.. నెటిజన్లు ఫిదా.. (వీడియో)
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం. అందుకే అందరూ తమ వివాహ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు సంగీత్‌లకు పెళ్లిలో ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. ఇందులో భాగంగా వధూవరులతో పాటు...
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం. అందుకే అందరూ తమ వివాహ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు సంగీత్‌లకు పెళ్లిలో ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. ఇందులో భాగంగా వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు సరదాగా ఆడిపాడుతున్నారు. వివిధ సినిమా పాటలకు తమదైన శైలిలో స్టెప్పులు వేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవల పెళ్లి సంగీత్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో మరొకటి నెట్టింట్లో బాగా హల్‌చల్ చేస్తోంది.రణ్‌బీర్ కపూర్ నటించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలోని ‘క్యూటీపీ’ అనే పాట ఎంతో ఫేమస్ అయింది. పెళ్లి వేడుక నేపథ్యంలో సాగే ఈ పాటను ఇప్పటికే చాలామంది రీక్రియేట్ చేశారు. తాజాగా భరత్ ధింగ్రా అనే వరుడు కూడా ఈ పాటకు స్టెప్పులేశాడు. పెళ్లికి వచ్చిన అతిథులతో కలిసి అద్భుతంగా కాలు కదిపాడు. అయితే వరుడి డ్యాన్స్ పక్కన పెడితే.. కాబోయే భర్తను ఉత్సాహ పరుస్తూ వధువు ఇచ్చిన రియాక్షన్ అక్కడి అతిథులతో పాటు నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియోలో ఇదే హైలెట్. ప్రస్తుతం ఈ క్యూట్ దంపతుల పెళ్లి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు నవ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ క్యూట్ పెళ్లి వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.